స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ ఘటనపై కలెక్టర్ విచారణ

విజయవాడలోని రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణప్యాలస్ కోవిడ్ కేర్ సెంటర్ లో అగ్నిప్రమాదానికి గల కారణాలు, వైఫల్యాలపై దృష్టి సారించారు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్.

స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ ఘటనపై కలెక్టర్ విచారణ
Balaraju Goud

|

Sep 02, 2020 | 11:20 AM

విజయవాడలోని రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణప్యాలస్ కోవిడ్ కేర్ సెంటర్ లో అగ్నిప్రమాదానికి గల కారణాలు, వైఫల్యాలపై దృష్టి సారించారు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్. స్వర్ణప్యాలస్ లో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలపై అవగాహన లేకుండా అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఘటన జరిగిన అనంతరం సంబంధిత అధికారులు పరిశీలనలో గుర్తించిన అంశాలపై వివరణ ఇవ్వాలని అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.

సంఘటన జరిగినప్పుడు ఉన్న డిఎంహెచ్ఓ, డాక్టర్ రమేష్, జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాసరెడ్డి కి షోకాజ్ నోటీసులు జారీ చేశా ఇంతియాజ్‌. స్వర్ణప్యాలస్ను 1988లో జీ+4 అంతస్తులకు అనుమతి తీసుకుని నిర్మించారని, అనధికారంగా తరవాత 5వ అంతస్తు నిర్మిస్తే ఫైర్ అధికారుల అనుమతి లేకుండా మున్సిపల్ రెగ్యులరైజ్ చేశారన్నారు. అనధికార కట్టడాన్ని ఎలా రెగ్యులరైజ్ చేశారో వివరణ ఇవ్వాలని వీఎంసీ అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే ఇద్దరు అధికారులు వివరణ ఇవ్వగా.. ఆ నివేదికను ఉన్నతాధికారులకు పంపారు. మరోవైపు, ఈ కేసుపై సుప్పీంకోర్టుకు వెళ్లాలని ఆంధ్ర ప్రభుత్వం భావిస్తోంది. అమాయకులైన వారి 10 మంది చావుకు కారణమైనవారికి కఠిన శిక్ష పడాలని భావిస్తోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu