కోల్‌కతాలో నర్స్‌కు వ్యాక్సిన్ సీరియస్ రియాక్షన్, సొమ్మసిల్లి పడ్డవైనం, ఆపై నిలకడగా ఆరోగ్యం

కరోనా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ మొదలైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ రియాక్షన్స్ స్వల్పంగా కనిపిస్తున్నాయి. కోల్‌కతా బిసి రాయ్..

  • Venkata Narayana
  • Publish Date - 8:04 am, Sun, 17 January 21
కోల్‌కతాలో నర్స్‌కు వ్యాక్సిన్ సీరియస్ రియాక్షన్, సొమ్మసిల్లి పడ్డవైనం, ఆపై నిలకడగా ఆరోగ్యం

Covid Vaccine Reaction : కరోనా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ మొదలైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ రియాక్షన్స్ స్వల్పంగా కనిపిస్తున్నాయి. కోల్‌కతా బిసి రాయ్ ఆస్పత్రిలో స్టాఫ్‌నర్స్‌కు టీకా సీరియస్ రియాక్షన్ ఇచ్చింది. వాక్సిన్ తీసుకున్న తర్వాత 35 సంవత్సరాల నర్స్ సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో వెంటనే విరుగుడు మందు ఇచ్చి ఆమెను దగ్గర్లోని నీల్ రతన్ సిర్కార్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఉంచి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ప్రస్తుతం నర్స్ ఆరోగ్యం నిలకడగా ఉంది. తనకు ఆస్తమాతోపాటు, ముందు నుంచీ వాక్సిన్ అలర్జీ కూడా ఉందని నర్స్ తెలిపింది. ఇప్పుడు నర్స్ పూర్తిగా కోలుకున్నారని వైద్యులు చెప్పారు.