కోడెల ఆత్మహత్య కేసు వేగవంతం… కీలక విషయాలు తెలిపిన శివరాం!

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసు దర్యాప్తును తెలంగాణ పోలీసులు వేగవంతం చేశారు. ఆదివారం గుంటూరు చేరుకున్న పోలీసులు కోడెల శివరాంని పిలిపించి కోడెల మృతికి గల కారణాలపై ఆరా తీసినట్లు సమాచారం. ఆత్మహత్య చేసుకున్నారా? ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు? అలాంటి విషయాలపై శివరామ్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కోడెల ఆత్మహత్యను అనుమానాస్పద మృతిగా హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.  ఇప్పటికే ఇంట్లో పనివాళ్లు, గన్‌మెన్‌లను విచారించి పోలీసులు స్టేట్‌మెంట్ నమోదు […]

కోడెల ఆత్మహత్య కేసు వేగవంతం... కీలక విషయాలు తెలిపిన శివరాం!
Follow us

| Edited By: Srinu

Updated on: Oct 14, 2019 | 5:50 PM

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసు దర్యాప్తును తెలంగాణ పోలీసులు వేగవంతం చేశారు. ఆదివారం గుంటూరు చేరుకున్న పోలీసులు కోడెల శివరాంని పిలిపించి కోడెల మృతికి గల కారణాలపై ఆరా తీసినట్లు సమాచారం. ఆత్మహత్య చేసుకున్నారా? ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు? అలాంటి విషయాలపై శివరామ్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కోడెల ఆత్మహత్యను అనుమానాస్పద మృతిగా హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.  ఇప్పటికే ఇంట్లో పనివాళ్లు, గన్‌మెన్‌లను విచారించి పోలీసులు స్టేట్‌మెంట్ నమోదు చేశారు. కోడెల కుమారుడు, కుమార్తెకు కూడా గతంలోనే తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే, తండ్రి అపకర్మలు నిర్వర్తించాల్సి ఉన్నందున కోడెల శివరాం కొంత సమయం కోరారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులే గుంటూరుకు వచ్చి కోడెల శివరాంను విచారణకు పిలిపించారు.  విచారణకు హాజరైన శివరాం తన తండ్రి శివప్రసాదరావు కేసుల ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పినట్లు సమాచారం. తన తండ్రి ఆత్మహత్య చేసుకునే ముందే తాను విదేశాలకు వెళ్లానని, తనకు తన కుటుంబసభ్యులు చెబితేనే ఈ విషయం తెలిసిందని చెప్పినట్లు సమాచారం. తండ్రితో తనకు ఎలాంటి గోడవలు లేవని శివరాం చెప్పారు. కోడెల శివప్రసాదరావు భార్య నుంచి కూడా తెలంగాణ పోలీసులు స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్నారు. కేసుల ఒత్తిడి కారణంగానే తన భర్త చనిపోయారని కోడెల భార్య చెప్పినట్లు తెలిసింది. తన భర్త ఎప్పుడూ దేనికీ భయపడే వ్యక్తి కాదని ఆమె చెప్పినట్లు సమాచారం.