కోడెల భౌతికకాయానికి పోస్ట్‌మార్టం పూర్తి! ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌‌కు తరలింపు

కోడెల భౌతికకాయానికి పోస్ట్‌మార్టం పూర్తి! ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌‌కు తరలింపు

కోడెల శివప్రసాదరావు భౌతికకాయానికి పోస్టుమార్టమ్ పూర్తయింది. హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో కోడెల భౌతిక కాయానికి దాదాపు రెండు గంటల పాటు వైద్యులు శవపరీక్ష నిర్వహించారు. ఎంబాంమింగ్ చేశారు. కోడెల పోస్టుమార్టాన్ని పోలీసులు వీడియోగ్రఫీ చేశారు. అయితే, పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో కోడెల ఉరేసుకుని చనిపోయినట్లు తేలింది. కోడెల మృతదేహాన్ని ఫోరెన్సిక్ నిపుణులు కూడా పరిశీలించారు. శరీరంపై ఎలాంటి గాయాలు లేవన్న ఫోరెన్సిక్ నిపుణులు చెవులు, గొంతు దగ్గర ఉరేసుకున్నట్లు ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. కోడెల మృతదేహానికి […]

Ram Naramaneni

|

Sep 16, 2019 | 8:13 PM

కోడెల శివప్రసాదరావు భౌతికకాయానికి పోస్టుమార్టమ్ పూర్తయింది. హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో కోడెల భౌతిక కాయానికి దాదాపు రెండు గంటల పాటు వైద్యులు శవపరీక్ష నిర్వహించారు. ఎంబాంమింగ్ చేశారు. కోడెల పోస్టుమార్టాన్ని పోలీసులు వీడియోగ్రఫీ చేశారు. అయితే, పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో కోడెల ఉరేసుకుని చనిపోయినట్లు తేలింది. కోడెల మృతదేహాన్ని ఫోరెన్సిక్ నిపుణులు కూడా పరిశీలించారు. శరీరంపై ఎలాంటి గాయాలు లేవన్న ఫోరెన్సిక్ నిపుణులు చెవులు, గొంతు దగ్గర ఉరేసుకున్నట్లు ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. కోడెల మృతదేహానికి పోస్టుమార్టం పూర్తవడంతో అల్లుడు మనోహర్‌కు భౌతికకాయాన్ని అప్పగించారు.

ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం కోడెల శివప్రసాదరావు పార్థివదేహాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌‌కు తరలించారు. అక్కడ టీడీపీ నేతలు, అభిమానులు కోడెలకు నివాళి అర్పిస్తున్నారు. కోడెల పార్థివదేహానికి హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణతో పాటు మాజీ మంత్రులు దేవినేని ఉమ, కేఈ కృష్ణమూర్తి, ఫరూక్‌ శ్రద్ధాంజలి ఘటించారు. ఇక టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్ ఇవాళ రాత్రి 9 గంటల సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ చేరుకుంటారు. అనంతరం కోడెల పార్థివ దేహానికి నివాళి అర్పిస్తారు. ఇదిలా ఉండగా, ఈ రాత్రికి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లోనే కోడెల భౌతికకాయం ఉంచనున్నారు. రేపు ఉదయం స్వగ్రామానికి తరలించనున్నారు.

కోడెల మృతిపై తెలంగాణ పోలీసుల విచారణః

కోడెల మృతిపై తెలంగాణ పోలీసుల విచారణ చేపట్టారు. కోడెల ఇంటికి మరోసారి వెళ్లారు. కుటుంబసభ్యుల వద్ద బంజారాహిల్స్ ఏసీపీ వివరాలు సేకరించారు. కోడెలది ఆత్మహత్య కాదంటూ తెలంగాణ డీజీపీ, సీపీ హైదరాబాద్, ఏసీపీ బంజారాహిల్స్ కు బురగడ్డ అనిల్ కుమార్ ఫిర్యాదు చేశారు. సమగ్ర విచారణ జరిపించాలంటూ ఫిర్యాదు పేర్కొన్నారు. ఆధారాల సేకరణ, ప్రత్యేక్ష సాక్షుల వాంగ్మూలాలు, ఘటన స్థలంలో ఫింగర్ ప్రింట్స్​ను క్లూస్ టీం, ఎఫ్ఎస్ఎల్ ఫింగర్ ప్రింట్స్ బృందం సేకరించారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu