పప్పు అంటే ఆ పప్పు కాదు..కందిపప్పు

ఏపీ అసెంబ్లీ ఈ రోజు ప్రశ్నోత్తారాలతో ప్రారంభమైంది. రాష్ట్రంలో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజల పరిస్థితి ఏమి కొనేటట్టు లేదు, తినేటట్టు లేదు అంటూ పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల గురించి టీడీపీ సభ్యురాలు ఆదిరెడ్డి భవాని సభలో ప్రసంగించారు. పప్పులు నిప్పులయ్యాలని..వంట నూనె, కూరగాయల ధరలు చుక్కలంటాయని..వీటిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఇవన్నీ చాలనట్టు ఇటీవలే ఆర్టీసీ చార్జీలు కూడా పెంచారని ఆమె గుర్తు చేశారు. ఈ […]

పప్పు అంటే ఆ పప్పు కాదు..కందిపప్పు
Ram Naramaneni

| Edited By: Srinu Perla

Dec 12, 2019 | 3:44 PM

ఏపీ అసెంబ్లీ ఈ రోజు ప్రశ్నోత్తారాలతో ప్రారంభమైంది. రాష్ట్రంలో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజల పరిస్థితి ఏమి కొనేటట్టు లేదు, తినేటట్టు లేదు అంటూ పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల గురించి టీడీపీ సభ్యురాలు ఆదిరెడ్డి భవాని సభలో ప్రసంగించారు. పప్పులు నిప్పులయ్యాలని..వంట నూనె, కూరగాయల ధరలు చుక్కలంటాయని..వీటిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఇవన్నీ చాలనట్టు ఇటీవలే ఆర్టీసీ చార్జీలు కూడా పెంచారని ఆమె గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ది పక్కనబెట్టి ఊరికే టీడీపీ నేతలను విమర్శించడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. నిత్యావసరాల పెరుగుదల వల్ల ప్రతి కుటుంబానికి నెలకు రూ. 3500 ఎక్కువ భారం పడుతుందని పేర్కొన్నారు. గత ఆరు నెలలకు ముందు ఉన్న ధరలు, ఇప్పుడు ఉన్న ధరలను ఆమె సభలో చదివి వినిపించారు.

కందిపప్పు గతంలో రూ.72 ఉండగా..ఇప్పుడు 110 అయిందని..వేరు శనగలు అప్పుడు రూ.98 ఉండగా ఇప్పుడు రూ.120 అయ్యాయని..ఉల్లి అయితే ఏకంగా రూ. 40 నుంచి, రూ 120 కు వెళ్లిందని ఆమె పేర్కొన్నారు. కాగా ఆదిరెడ్డి భవాని ప్రశ్నలకు సివిల్ సప్లైస్ మినస్టర్ కొడాలి నాని సమాధానాలు ఇచ్చారు. ప్రతిపక్షాలు చెప్తన్నవన్నీ అబద్దాలని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం కూడా నిత్వావసరాల ధరలు 10 శాతం పెరుగుతాయని, అవి పెరుగుదల కింద పరిగణలోకి తీసుకోరని తెలిపారు. ఈ సందర్భంగా..ఆయన పప్పులు రేట్ల గురించి ప్రస్తావించారు. వెనక ఉన్న సభ్యులు ఏ పప్పు అని సరదాగా వ్యాఖ్యానించగా..ఆ పప్పు కాదులేండి అంటూ నాని సమాధానమిచ్చారు. ఇక ధరల పెరుగుదల రాష్ట్రంలో మాత్రమే కాదని,  దేశవ్యాప్తంగా డిమాండ్‌ను బట్టి హెచ్చుతగ్గులు ఉంటాయన్నారు. అతివృష్టి, అనావృష్టి లాంటి కారణాల వల్ల ధరల్లో డిఫరెన్స్‌స్ ఉంటాయని, అధికంగా పెరిగిన ఉల్లిని ఏపీ ప్రభుత్వం రూ. 25 కే రైతు బజార్ల ద్వారా విక్రయిస్తున్నట్లు గుర్తు చేశారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu