IPL 2020: KXIP Vs MI ఎవరు గెలవాలన్నా.. ఇదే కీలకం

ఐపీఎల్ సీజన్‌-13లో ఈ రోజు కింగ్స్‌ లెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య 13వ మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లాడిన ఈ రెండు టీమ్స్‌.. ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచాయి. పాయింట్స్‌ టేబుల్లో కేఎల్ రాహుల్‌ సేన ఐదో స్థానంలో ఉండగా..

IPL 2020: KXIP Vs MI ఎవరు గెలవాలన్నా.. ఇదే కీలకం
Follow us

|

Updated on: Oct 01, 2020 | 4:46 PM

మస్త్ మజా ముందున్నా.. ధూం దాం మెరుపులతో ఐపీఎల్ 2020 సందడిగా సాగుతోంది. ఐపీఎల్ సీజన్‌-13లో ఈ రోజు కింగ్స్‌ లెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య 13వ మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లాడిన ఈ రెండు టీమ్స్‌.. ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచాయి. పాయింట్స్‌ టేబుల్లో కేఎల్ రాహుల్‌ సేన ఐదో స్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ గ్యాంగ్ ఆరో ప్లేస్‌లో కొనసాగుతోంది. నాలుగో మ్యాచ్ ఆడుతున్న ఇరు జట్లు మరో విజయంపై కన్నేశాయి. పంజాబ్‌తో మ్యాచ్‌ కోసం ముంబై ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తుందని చెప్పవచ్చు.

కింగ్స్‌ లెవన్ పంజాబ్‌కు ఓపెనర్లు కేఎల్‌ రాహుల్, మయాంక్‌ అగర్వాల్ మంచి ఫామ్‌లో దూకుడు మీదున్నారు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న రాహుల్‌ మూడు మ్యాచ్‌ల్లో 222 పరుగులు సాధించి ఆరెంజ్‌ క్యాప్‌ దక్కించుకున్నాడు. సీజన్‌లో వ్యక్తిగత స్కోరు 132 అజేయంగా నిలిచాడు. ముంబైపై రాహుల్‌కు గొప్ప రికార్డు ఉంది.

ఐపీఎల్‌లో వీరిద్దరు మాత్రమే సెంచరీలు నమోదు చేసి జోరుమీదున్నారు. మిడిలార్డర్‌ పెద్దగా రాణించకపోవడం టీమ్‌పై ప్రభావం చూపిస్తోంది. మ్యాక్స్‌వెల్‌ ఈ మ్యాచ్‌లోనైనా భారీ స్కోర్‌ చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో కాట్రెల్‌, షమీ, రవి బిష్ణోయ్‌, అశ్విన్‌ తిప్పేస్తున్నారు. బ్యాట్స్‌మెన్‌ను ముప్ప తిప్పలు పెడుతూ కట్టడి చేయడంలో సక్సెస్ అవుతున్నారు.

దుబాయ్‌ వేదికగా రాయల్ చాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌ ముంబై ఇండియన్స్‌ సూపర్‌ ఓవర్‌లో ఓడిపోయింది. కానీ ఆ మ్యాచ్‌లో టాప్‌ త్రి ఫెయిలైనప్పటికీ.. తొలి మ్యాచ్‌ ఆడిన ఇషాన్ కిషన్, ఆల్‌ రౌండర్ పోలార్డ్‌ రాణించడంతో 200 మార్క్‌ను దాటింది. సూర్య కుమార్‌ పర్వాలేదనిపిస్తున్నటికీ.. హార్ధిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా ఇంకా బ్యాట్‌కు పనిచెప్పకపోవడం పెద్ద మైనస్ అని చెప్పవచ్చు.

బౌలింగ్ విభాగంలో బౌల్ట్, రాహుల్ చాహర్ మాత్రమే ఫామ్‌లో ఉన్నారు. బుమ్రా ఫెయిల్‌ అవుతుండడంతో రోహిత్‌ సేనకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే ఈ రోజు జరగనున్న పోరులో రాహుల్‌ను కట్టడి చేయండం… ఎవరు టాస్ గెలిచినా ప్రత్యర్ధులకు భారీ స్కోరును టార్గెట్‌గా పెట్టడం ఇవే ఇప్పుడు ఇరు జట్ల ముందు ఉన్న టార్గెట్లు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!