ఈ ఏడాది ఒక అడుగు ఎత్తులో ఖైరతాబాద్‌ వినాయకుడు..!

ఈ ఏడాది ఒక అడుగు ఎత్తులో ఖైరతాబాద్‌ వినాయకుడు..!

వినాయక చవితి పండుగ అంటే చాలు తెలుగువారికి ఖైరతాబాద్ గణప‌తి గుర్తుకువ‌స్తాడు. ప్రతి ఏడాది ఈ భారీ విఘ్నేశ్వ‌రుడ‌ని ద‌ర్శించుకునేందుకు..ఎన్నో ప్రాంతాల నుంచి భ‌క్తులు త‌ర‌లివ‌స్తారు. ఖైరతాబాద్‌ గణేషుడిని అత్యంత అద్భుతంగా భ‌క్తిశ్ర‌ద్ద‌ల‌తో తీర్చిదిద్దుతారు నిర్వాహ‌కులు. కానీ ఈ ఏడాది భారీ ఎత్తులో ఉండే గణనాథుడిని భ‌క్తులు చూసే అవ‌కాశం ఉండ‌క‌పోవ‌చ్చు. కరోనా వైరస్‌ కారణంగా కేవలం ఒక అడుగు ఎత్తులో మాత్రమే గణేషుడి ప్రతిమను ప్రతిష్టించనున్నట్లు తెలుస్తోంది. వైర‌స్ వ్యాప్తి జ‌రిగే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో […]

Ram Naramaneni

|

May 12, 2020 | 4:59 PM

వినాయక చవితి పండుగ అంటే చాలు తెలుగువారికి ఖైరతాబాద్ గణప‌తి గుర్తుకువ‌స్తాడు. ప్రతి ఏడాది ఈ భారీ విఘ్నేశ్వ‌రుడ‌ని ద‌ర్శించుకునేందుకు..ఎన్నో ప్రాంతాల నుంచి భ‌క్తులు త‌ర‌లివ‌స్తారు. ఖైరతాబాద్‌ గణేషుడిని అత్యంత అద్భుతంగా భ‌క్తిశ్ర‌ద్ద‌ల‌తో తీర్చిదిద్దుతారు నిర్వాహ‌కులు. కానీ ఈ ఏడాది భారీ ఎత్తులో ఉండే గణనాథుడిని భ‌క్తులు చూసే అవ‌కాశం ఉండ‌క‌పోవ‌చ్చు. కరోనా వైరస్‌ కారణంగా కేవలం ఒక అడుగు ఎత్తులో మాత్రమే గణేషుడి ప్రతిమను ప్రతిష్టించనున్నట్లు తెలుస్తోంది. వైర‌స్ వ్యాప్తి జ‌రిగే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో భారీ విగ్రహ ఏర్పాటును గణేశ్‌ ఉత్సవ కమిటీ విరమించుకుంది. ఈ నెల 18న నిర్వహించాల్సిన కర్ర పూజ కార్యక్రమాన్ని సైతం కమిటీ రద్దు చేసింది. ఈ ఏడాది ఒక అడుగు ఎత్తు విగ్రహాన్ని ప్రతిష్టించాలని కమిటీ నిర్ణయించింది. దీనిపై ముఖ్యమంత్రిని, రాష్ట్ర పోలీసుల అనుమతి కోరి..ఆ త‌ర్వాత ఫైన‌ల్ డెషిస‌న్ ప్రకటిస్తామ‌ని కమిటీ స‌భ్యులు తెలిపారు.

2019లో ద్వాదశ ఆదిత్య మహాగణపతిగా భక్తుల ముందుకు వచ్చాడు ఖైరతాబాద్‌ వినాయకుడు. 12 తలలు, ఏడు అశ్వాలు, 12 సర్పాలతో.. 61 అడుగుల ఎత్తులో గణేషుడు భక్తులకు ఆశిస్సులు అంద‌జేశాడు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu