చైల్డ్ పోర్నోగ్ర‌ఫి..రాష్ట్ర వ్యాప్తంగా 47 మంది అరెస్ట్..

కోవిడ్ -19 లాక్ డౌన్ సందర్భంగా ఆన్‌లైన్‌లో పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్ప‌డుతున్న‌ వారిపై కేరళ పోలీసులు కొర‌డా ఝులిపించారు.

చైల్డ్ పోర్నోగ్ర‌ఫి..రాష్ట్ర వ్యాప్తంగా 47 మంది అరెస్ట్..
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jun 22, 2021 | 4:32 PM

కోవిడ్ -19 లాక్ డౌన్ సందర్భంగా ఆన్‌లైన్‌లో పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్ప‌డుతున్న‌ వారిపై కేరళ పోలీసులు కొర‌డా ఝులిపించారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా రహస్య ఆపరేషన్‌లో 47 మందిని పోలీసులు పట్టుకున్నారు. పి-హంట్ 20.1 అనే ఆపరేషన్ లో భాగంగా పిల్ల‌ల వీడియోలు, ఫోటోలు క‌లిగిన‌ మొబైల్ ఫోన్లు, హార్డ్ డిస్కులు, మొమ‌రీ కార్డ్స్, కంప్యూట‌ర్లు..మొత్తం క‌లిపి 143 వ‌స్తువుల‌ను స్వాధీనం చేసుకున్నారు.

వీటిలో అనేక వీడియోలు, చిత్రాలు ఆరు నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు గల స్థానిక పిల్లలవి కావడం చాలా బాధ కలిగించిందని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కేరళ పోలీసుల సైబర్‌డోమ్ నోడల్ ఆఫీసర్ మనోజ్ అబ్రహం తెలిపారు. లాక్ డౌన్ సమయంలో కేరళ పోలీసుల స్పెష‌ల్ టీమ్ నిర్వహించిన డిజిటల్ విశ్లేషణలో పిల్లల లైంగిక వేధింపులపై ఆన్‌లైన్ మెటీరియల్ పెరుగుదల గమనించినట్లు అబ్రహం చెప్పారు. మరింత లోతైన దర్యాప్తులో ఇందుకు సంబంధించిన‌ అనేక సోషల్ మీడియా గ్రూపులు కనుగొన్నారు పోలీసులు. ఒక్కొక్క గ్రూపులో 200 మందికి పైగా సభ్యులు అలాంటి చిత్రాలను షేర్ చేశార‌ని గుర్తించారు. చాలా అశ్లీల చిత్రాలు, వీడియోలు ఇళ్ళ లోపల చిత్రీక‌రించిన‌వే ఇటీవలి కాలంలో అప్‌లోడ్ చేయబడ్డాయని నిర్దారించారు. ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో పిల్ల‌లు ఎన్ని ఒత్తిళ్లు ఎదుర్కొన్నారో ఈ ఉదంతం తెలియ‌జేస్తుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ చేయాలని రాష్ట్ర పోలీసు చీఫ్ లోక్‌నాథ్ బెహెరా ఆదేశించారు. ఈ నేప‌థ్యంలో 110 ప్ర‌దేశాల్లో సోదాలు చేశారు పోలీసులు. 89 కేసులు నమోదయ్యాయి. అరెస్టయిన వారిలో ప్రొఫెషనల్ ఉద్యోగాల్లో పనిచేసే యువకులు ఉండ‌టం గ‌మ‌నార్హం. వారిలో ఎక్కువ మంది ఐటి అవగాహన గల‌వారు కావ‌డంతో కంటెంట్ అప్‌లోడ్ చేయడానికి, డౌన్‌లోడ్ చేయడానికి టెక్నాల‌జీ ఉపయోగించిన‌ట్టు నిర్దారంచారు. కొందరు పిల్లల అక్రమ రవాణాకు పాల్పడినట్లు అనుమానిస్తున్నట్లు అబ్రహం తెలిపారు.

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!