భారతీయుడికి జాక్‌పాట్‌.. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 20కోట్లు కొట్టేశాడు..!

దుబాయ్‌లో మరో భారతీయుడికి జాక్‌పాట్ తగిలింది. సేల్స్‌మన్‌గా పనిచేసే ఓ వ్యక్తి లాటరీలో కోటీశ్వరుడు అయిపోయాడు.

  • Tv9 Telugu
  • Publish Date - 6:58 am, Tue, 5 May 20
భారతీయుడికి జాక్‌పాట్‌.. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 20కోట్లు కొట్టేశాడు..!

దుబాయ్‌లో మరో భారతీయుడికి జాక్‌పాట్ తగిలింది. సేల్స్‌మన్‌గా పనిచేసే ఓ వ్యక్తి లాటరీలో కోటీశ్వరుడు అయిపోయాడు. ఏకంగా పది మిలియన్‌ దిర్హమ్స్‌(సుమారు రూ.20కోట్లు)సొంతం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని త్రిశ్శూర్‌కి చెందిన దిలీప్‌ కుమార్ ఎల్లికొట్టల్‌ పరమేశ్వరన్ అనే వ్యక్తి 17 సంవత్సరాలుగా యూఏఈలోని అజ్మాన్ నగరంలో నివాసం ఉంటున్నారు. అక్కడే ఓ ఆటోమొబైల్ సంస్థలో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నారు. అబుదాబి అంతర్జాతీయ విమనాశ్రాయంలో ప్రతి నెల మూడో తారీఖున నిర్వహించే లాటరీలో 500 దిర్హమ్స్‌(రూ.10వేలు)పెట్టి ఇటీవల ఆయన ఒక టికెట్ కొన్నారు. ఆ లాటరీ డ్రాలో దిలీప్ సుమారు రూ.20కోట్లు గెలుచుకున్నట్లు అక్కడి స్థానిక వార్త సంస్థ తెలిపింది. గెలుచుకున్న మొత్తంలో కొంత సొమ్ముతో బ్యాంక్‌లోన్‌ను చెల్లిస్తానని.. మిగిలిన సొమ్మును తన ఇద్దరు పిల్లల చదువుల కోసం వినియోగించబోతున్నట్లు దిలీప్ వెల్లడించారు.

Read This Story  Also: మరో మూడు నెలల పాటు ‘వాయిదా’ పొడిగించనున్న ఆర్బీఐ..!