అమ్మా! నీ ఆనందమే నా ఆశయం..ఓ కొడుకు భావోద్వేగ పోస్ట్

అతనో టీనేజ్ యువకుడు. సహజంగా ఆ టైంలో ద‌ృష్టి అంతా పక్కదార్లు పడుతూ ఉంటుంది. ప్రేమ, ఆకర్షణ లాంటి వాటికి లోనవుతూ ఉంటారు. లగ్జరీగా లైఫ్ ఉండాలని..అందుకోసం ఏమైనా చెయ్యడానికి సిద్దపడుతూ ఉంటారు. కానీ ఒక కుర్రాడు మాత్రం తన జన్మనిచ్చిన తల్లి ఆనందంగా ఉండాలిని కోరుకున్నాడు. అందుకోసం అతి తక్కువ వయసులో..గొప్ప ఆలోచనను చేశాడు. ‘అసలు ఇలాంటి ఫోస్ట్ రాసేముందు నేను ఎంతగానో ఆలోచించాను. జనరేషన్‌లో ఇంత మార్పు వచ్చినా కూడా ఒక మహిళ రెండో […]

అమ్మా! నీ ఆనందమే నా ఆశయం..ఓ కొడుకు భావోద్వేగ పోస్ట్
Follow us

|

Updated on: Jun 12, 2019 | 3:58 PM

అతనో టీనేజ్ యువకుడు. సహజంగా ఆ టైంలో ద‌ృష్టి అంతా పక్కదార్లు పడుతూ ఉంటుంది. ప్రేమ, ఆకర్షణ లాంటి వాటికి లోనవుతూ ఉంటారు. లగ్జరీగా లైఫ్ ఉండాలని..అందుకోసం ఏమైనా చెయ్యడానికి సిద్దపడుతూ ఉంటారు. కానీ ఒక కుర్రాడు మాత్రం తన జన్మనిచ్చిన తల్లి ఆనందంగా ఉండాలిని కోరుకున్నాడు. అందుకోసం అతి తక్కువ వయసులో..గొప్ప ఆలోచనను చేశాడు.

‘అసలు ఇలాంటి ఫోస్ట్ రాసేముందు నేను ఎంతగానో ఆలోచించాను. జనరేషన్‌లో ఇంత మార్పు వచ్చినా కూడా ఒక మహిళ రెండో పెళ్లి చేసుకుంటే వింతగా చూసే సమాజంలో మనం ఉన్నామని చెప్పుకోడానికి కాస్త ఇబ్బందిగా ఉంది. ఎవరైతే అనుమానం, ద్వేషం వంటి విపరీత భావనలు కలిగి ఉంటారో.. దయచేసి అటువంటి వాళ్లు ఈ పోస్టు వంక చూడకపోవడమే మంచిది. ఒకవేళ మీరు ఏమైనా అన్నా సరే. దాని పట్టించుకునే వాళ్లెవరూ లేరు ఇక్కడ. అవును ఈ పోస్టు మా అమ్మ పెళ్లి గురించి’ అంటూ కేరళకు చెందిన గోకుల్‌ శ్రీధర్‌ అనే అబ్బాయి ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు పలువురిని ఆలోచింపజేస్తుంది. వితంతువు, భర్త వదిలేసిన లేదా భర్తను వదిలేసిన స్త్రీ రెండో పెళ్లి చేసుకోవడాన్ని, ఆమె మరో కొత్త జీవితం ప్రారంభించడాన్ని ఆమె సంతానం హర్షిస్తుందనడానికి తాజా ఇన్సిడెంట్ సాక్ష్యంగా నిలిచింది.

 కేరళలోని కొల్లాంకు చెందిన గోకుల్‌ శ్రీధర్‌ తల్లిదండ్రులతో కలిసి జీవించేవాడు. అయితే వారిద్దరు తనకు తల్లిదండ్రులే ఉంటున్నారే తప్ప భార్యభర్తలుగా మెలగడం లేదని అర్థం చేసుకోవడానికి అతడికి  కొంత సమయం పట్టింది. తన భవిష్యత్తు కోసం.. భర్త పెట్టే చిత్రహింసలను సైతం చిరునవ్వుతో భరించే తల్లి ఆవేదన పెరిగి పెద్దవుతున్న కొద్దీ అర్థం చేసుకోసాగాడు. కేవలం తన కారణంగా స్త్రీని ఒక దాసిలా భావించే తండ్రి మూర్ఖత్వానికి అమ్మ జీవితం చెరలో చిక్కుకుందే అనే అపరాధ భావన ..గోకుల్‌ను అనుక్షణం వెంటాడింది. తనకు ఊపిరిపోసిన మాతృమూర్తి తన కోసం నిత్య కష్టాలు పడటాన్ని అతని సహించలేక పోయాడు. తీవ్రమైన మానసిక సంఘర్షణకు అతను ఒకరోజు పుల్‌స్టాప్ పెట్టాడు. చెరసాల లాంటి ఆ ఇంటి నుంచి తన తల్లిని తీసుకుని బయటకు వచ్చేశాడు. హింసించే భర్త నుంచి విముక్తి పొందిన తన తల్లి తాజాగా రెండో పెళ్లి చేసుకోవడంతో గోకుల్‌ ప్రస్తుతం ఆనందడోలికల్లో తేలియాడుతున్నాడు. ఈ క్రమంలో తన తల్లి గురించి అతడు ఫేసుబుక్‌లో రాసుకొచ్చిన మాటలు.. బిడ్డ భవిష్యత్తు కోసం ఒక తల్లి ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడుతుందనే విషయాన్ని మరోసారి గుర్తుచేశాయి.

‘నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహిళ. ఆమె వైవాహిక జీవితంలో ఎంతో హింసను భరించింది. భర్త కొట్టే దెబ్బలకు ఒక్కోసారి నుదుటి నుంచి రక్తం ధారాపాతంగా కారుతూ ఉండేది. అయినా ఆమె ముఖంలో బాధ కంటే భయమే ఎక్కువగా ఉండేది. ఇవన్నీ ఎందుకు భరిస్తున్నావు అని ఎన్నోసార్లు ఆమెను అడిగాను. నీ కోసమే నాన్నా.. నువ్వు బాగుండాలంటే ఇవన్నీ భరించక తప్పదు అన్న ఆమె మాటలు నన్నెంతో అపరాధ భావానికి గురిచేసేవి. ఒకరోజు ఆమెతో కలిసి నేను కూడా నరకం లాంటి ఆ ఇంటిని వదిలి వచ్చేసాను. అవును ఆమె ఎవరో కాదు మా అమ్మ. నా కోసం తన కలలు త్యాగం చేసిన మాతృమూర్తి. మేము ఇళ్లు విడిచిన నాడే ఈ విషయం గురించి ఒక నిర్ణయానికి వచ్చేసాను. ఇందులో దాచాల్సింది ఏమీ లేదు. అమ్మా.. కొత్త భాగస్వామి సాన్నిహిత్యంలో నీ జీవితం సంతోషంగా గడవాలి. శుభాకాంక్షలు’ అంటూ.. గోకుల్‌ తన తల్లి, ఆమె రెండో భర్త ఫొటోను సగర్వంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అంతేగాక నెగటివ్‌ కామెంట్లు చేసేవారు ఈ పోస్టు చూసి అనవసరంగా సమయం వృథా చేసుకోకండి అని సలహా కూడా ఇచ్చాడు. అయితే అమ్మ గొప్పదనం, ఆమె త్యాగం ఎరిగిన వాళ్లంతా ప్రస్తుతం గోకుల్‌ తల్లికి శుభాకాంక్షలు తెలుపుతూనే.. అతడి ధైర్యాన్ని అభినందిస్తున్నారు. నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ పోస్టు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. లైకులు, షేర్లతో దూసుకుపోతోంది.