తెలంగాణ ఇంజనీర్లకు శుభాకాంక్షాలు చెప్పిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ నగరంపై చెరగని ముద్ర వేసిన అత్యుత్తమ సివిల్ ఇంజనీర్.. ఆర్ట్స్‌ కళాశాల, ఉస్మానియా దవాఖాన భవనం, అఫ్జల్‌గంజ్‌ లైబ్రరీ, యునానీ దవాఖానలపై ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.  తెలంగాణ ఆర్థర్‌ కాటన్ గా పేరు తెచ్చుకున్న.. నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌ జయంతిని పురష్కరించుకుని ఇంజనీర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌ నిజాం సంస్థానంలో అత్యంత ప్రతిభావంతుడైన ఇంజినీర్‌గా పేరు తెచ్చుకోవడమే కాదు.. నీటి పారుదల పితామహుడిగా.. తెలంగాణ ఆర్థర్‌ కాటన్‌గా కీర్తిని […]

తెలంగాణ ఇంజనీర్లకు శుభాకాంక్షాలు చెప్పిన సీఎం కేసీఆర్
Follow us

|

Updated on: Jul 11, 2020 | 12:36 PM

హైదరాబాద్ నగరంపై చెరగని ముద్ర వేసిన అత్యుత్తమ సివిల్ ఇంజనీర్.. ఆర్ట్స్‌ కళాశాల, ఉస్మానియా దవాఖాన భవనం, అఫ్జల్‌గంజ్‌ లైబ్రరీ, యునానీ దవాఖానలపై ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.  తెలంగాణ ఆర్థర్‌ కాటన్ గా పేరు తెచ్చుకున్న.. నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌ జయంతిని పురష్కరించుకుని ఇంజనీర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్‌ నిజాం సంస్థానంలో అత్యంత ప్రతిభావంతుడైన ఇంజినీర్‌గా పేరు తెచ్చుకోవడమే కాదు.. నీటి పారుదల పితామహుడిగా.. తెలంగాణ ఆర్థర్‌ కాటన్‌గా కీర్తిని సొంతం చేసుకున్నారు. ఆనాటి నిర్మాణ విశిష్టత, గొప్ప కట్టడాల వెనుక నవాబ్‌ అలీ ముద్రలే కనిపిస్తాయి. జూలై11న ఆయన జయంతి.

ఈ రోజును తెలంగాణ ఇంజినీర్స్‌ డేగా జరుపుతున్నారు. హైదరాబాద్‌ సంస్థానంలో ఒక లెజెండ్‌గా నిలిచిన ఈ మేధావి సాధించిన అద్భుతాలను తెలంగాణలోని ఇంజనీర్లు గుర్తు చేసుకుంటున్నారు.

నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్ ఆదిలో…

నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌ అనేక సాగునీటి ప్రాజెక్టులు, చారిత్రక భవనాలు, వంతెనలను నిర్మించి నిరుపమానమైన సేవలు అందించారు. తన జీవిత కాలంలో ఆయన సాధించిన విజయాలు, తెలంగాణ ఇంజినీర్లకు స్ఫూర్తిదాయకంగా మారుతాయి. ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌, స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరీ, యునానీ హాస్పిటల్‌, ఆర్ట్స్‌ కళాశాల, జూబ్లీహాల్‌, ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌, ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌సాగర్‌ జంట జలాశయాలు, నగరంలోని భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, ఇవన్నీ అలీ నవాజ్‌ జంగ్‌ ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్మించారు. ఆయన హైదరాబాద్ నిజాం సంస్థానాకిి చిరస్మరణీయమైన సేవలను అందించారు.