దిశ నిందితుల ఎన్‌కౌంటర్: వైఎస్‌‌ను గుర్తు చేసిన కేసీఆర్!

దిశ నిందితుల ఎన్‌కౌంటర్: వైఎస్‌‌ను గుర్తు చేసిన కేసీఆర్!

దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన డాక్టర్ దిశ హత్యకేసులోని నిందితులను ఇవాళ తెల్లవారుజామున పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. షాద్‌నగర్ సమీపంలో చటాన్‌పల్లి బ్రిడ్జ్ దగ్గర సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారు. ఇక ఆ సమయంలో పోలీసులు నలుగురు నిందితులను కాల్చి చంపారు. మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు.. దిశ మరణించిన ప్రదేశంలోనే మృతి చెందటంతో ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఎన్ కౌంటర్ ఎలా జరిగిదన్న విషయాన్ని పోలీసులు […]

Ravi Kiran

|

Dec 07, 2019 | 6:11 AM

దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన డాక్టర్ దిశ హత్యకేసులోని నిందితులను ఇవాళ తెల్లవారుజామున పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. షాద్‌నగర్ సమీపంలో చటాన్‌పల్లి బ్రిడ్జ్ దగ్గర సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారు. ఇక ఆ సమయంలో పోలీసులు నలుగురు నిందితులను కాల్చి చంపారు. మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు.. దిశ మరణించిన ప్రదేశంలోనే మృతి చెందటంతో ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే ఎన్ కౌంటర్ ఎలా జరిగిదన్న విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచగా.. సీపీ సజ్జనార్ మరికాసేపట్లో పూర్తి వివరాలు తెలియజేయనున్నారు. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన నేపథ్యంలో దిశ తల్లిదండ్రులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నిందితులకు ఇంత త్వరగా శిక్ష విధించడం పట్ల తమకు ఆనందంగా ఉందన్నారు. ఇకపోతే దిశ హత్యకేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వం, టీఎస్ పోలీసుల వైఖరిపై ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. దిశ అత్యాచారం, హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనమైంది. అటు కేసీఆర్ కూడా నిందితులకు కఠిన శిక్షలు విధించాలంటూ.. ఫాస్ట్‌‌ట్రాక్ కోర్టు, సిట్‌ను ఏర్పాటు చేసేలా చర్యలు కూడా తీసుకున్నారు. అయితే కేసులు, కోర్టు విచారణలు ఇలాంటివారికి అనవసరం అనేలా.. నిందితులను ఎన్ కౌంటర్ చేయడం పట్ల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ తరుణంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని మరోసారి కేసీఆర్ గుర్తు చేశారంటూ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. పదేళ్ల కిందట ఇలాంటి ఘటన ఒకటి వరంగల్‌లో జరిగితే.. అప్పటి ముఖ్యమంత్రిగా వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. ఇక ఆ దాడి చేసిన నిందితులను కూడా ఎన్ కౌంటర్ చేసి చంపారు. ఏది ఏమైనా అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి ఈ ఎన్ కౌంటర్లతో భయం పుట్టాలి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu