మేమెంతో కష్టాల్లో ఉన్నాం.. రాహుల్ కి కాశ్మీరీ మహిళ మొర

మేమెంతో కష్టాల్లో ఉన్నాం.. రాహుల్ కి కాశ్మీరీ మహిళ మొర

ఆర్టికల్ 370 ని కేంద్రం రద్దు చేసిన అనంతరం తమ రాష్ట్రంలో తాము ఎన్నో బాధలు, కష్టాలు పడుతున్నామని ఓ కాశ్మీరీ మహిళ… కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మొర పెట్టుకుంది. కాశ్మీర్లో పరిస్థితిని అధ్యయనం చేసేందుకు రాహుల్ సహా 11 విపక్ష పార్టీల నేతలు ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్లగా.. అక్కడి విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే.. దీంతో మళ్ళీ ఈ బృందం విమానంలో ఢిల్లీ తిరిగి ప్రయాణమయింది. ప్లేన్ లో వీరితో బాటు […]

Anil kumar poka

|

Aug 25, 2019 | 3:41 PM

ఆర్టికల్ 370 ని కేంద్రం రద్దు చేసిన అనంతరం తమ రాష్ట్రంలో తాము ఎన్నో బాధలు, కష్టాలు పడుతున్నామని ఓ కాశ్మీరీ మహిళ… కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మొర పెట్టుకుంది. కాశ్మీర్లో పరిస్థితిని అధ్యయనం చేసేందుకు రాహుల్ సహా 11 విపక్ష పార్టీల నేతలు ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్లగా.. అక్కడి విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే.. దీంతో మళ్ళీ ఈ బృందం విమానంలో ఢిల్లీ తిరిగి ప్రయాణమయింది. ప్లేన్ లో వీరితో బాటు ప్రయాణించిన ఈ మహిళ.. తన కష్టాలు చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయింది. ‘ మా పిల్లలు ఇంటినుంచి బయటకు రాలేకపోతున్నారు. నా సోదరుడు హార్ట్ పేషంట్.. కానీ 10 రోజులుగా కనీసం డాక్టర్ని సంప్రదించలేకపోతున్నాడు.. మా కష్టాలు చెప్పనలవి కాదు ‘ అని ఆమె వాపోయింది. దీంతో రాహుల్ తన సీటు నుంచి లేచి వచ్చి ఆమెను ఓదార్చవలసి వచ్చింది. గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, కె. సి. వేణుగోపాల్ ఇతర విపక్ష నేతలు ఆమె గద్గద స్వరంతో చెబుతున్నదాన్ని ఓపికగా ఆలకించారు. ఈ వీడియోను కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాధికా ఖేరా పోస్ట్ చేశారు. ఢిల్లీకి తిరిగి వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ.. జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి సాధారణంగా లేదన్నారు. ప్రజలు ఏం చెప్పాలనుకుంటున్నారో తాము తెలుసుకోదలిచామని, కానీ శ్రీనగర్ విమానాశ్రయం నుంచే తమను తిప్పి పంపేశారని ఆయన తెలిపారు. మాతో బాటు వఛ్చిన జర్నలిస్టులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు అని రాహుల్ పేర్కొన్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu