ఐస్‌క్రీంలో విషం కలిపి కుటుంబాన్నే చంపాలనుకున్నాడు..

ఐస్‌క్రీంలో విషం కలిపి కుటుంబాన్నే చంపాలనుకున్నాడు..

కేరళలోని కాసరాగోడ్ జిల్లాలోని బాలాల్ వద్ద తన సోదరి ఆన్ మేరీ(16)ని హత్య చేసిన కేసులో ఆల్బిన్ బెన్నీ అనే 22 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Balaraju Goud

|

Aug 14, 2020 | 4:26 PM

కేరళలో ఓ యువకుడు ఒంటరితనానికి అలవాటుపడ్డాడు. మొత్తం కుటుంబాన్నే అంతం చేయాలనుకున్నాడు. అనుకున్న ఫ్లాన్ ప్రకారం ఐస్‌క్రీంలో విషం కలిపి తల్లిదండ్రితో పాటు సోదరికి తినిపించాడు. అయితే, చెల్లెలుల మరణించగా, తల్లిదండ్రులు క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటన కాసరాగోడ్ జిల్లాలో చోటుచేసుకుంది.

కేరళలోని కాసరాగోడ్ జిల్లాలోని బాలాల్ వద్ద తన సోదరి ఆన్ మేరీ(16)ని హత్య చేసిన కేసులో ఆల్బిన్ బెన్నీ అనే 22 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 5న ఆన్ మేరీ తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరింది. ఆమె చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు సమాచారం అందుకున్నారు. అయితే, కేరళ బాలిక కేసులో అనుమానంతో దర్యాప్తు చేపట్టిన హత్యగా నిర్ధారించారు. విషం కలిపిన ఐస్‌క్రీం తినడం వల్లే ఆమె చనిపోయినట్టు తేల్చారు. ఆమె అన్న ఆల్బిన్ బెన్నీ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఆమెతో సహా కుటుంబాన్ని హతమార్చడానికి ఐస్‌క్రీమ్‌లో విషం కలిపినట్టు దర్యాప్తులో తేలింది.

ఒంటరితనానికి అలవాటు పడ్డ ఆల్బిన్ బెన్నీ కుటుంబం మొత్తాన్ని హత్య చేయాలని పథకం వేశాడని పోలీసులు తెలిపారు. పథకం ప్రకారం ఆగస్టు 5న ఐస్‌క్రీంలో విషం కలిపి తల్లిదండ్రులు, సోదరికి ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఐస్‌క్రీం తిన్న తర్వాత తండ్రి, సోదరి అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం హాస్పిటల్‌లో చేర్పించారు. బాలిక చికిత్స పొందుతూ అస్పత్రిలో మృతి చెందింది. అదే ఐస్‌‌క్రీమ్ తిన్న తల్లికి మాత్రం ఏంకాలేదని పోలీసులు తెలిపారు. బాలిక అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా, ఆల్బిన్ బెన్నీ అసలు విషయాన్ని ఒప్పేసుకున్నాడు. ఐస్‌‌క్రీంలో విషం కలిపినట్టు నిందితుడి వెల్లడించాడని, అతడి స్టేట్‌మెంట్‌ను నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. నిందితుడి అల్బిన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన తండ్రి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. అతడి తల్లి క్షేమంగానే ఉన్నారని, ఆమెకు కూడా వైద్యులు పరీక్షలు నిర్వహించారన్నారు

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu