Coronavirus In Karnataka: కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీని కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కనుగొనే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కర్ణాటకలో గత రెండు రోజులుగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ రోజు ఏకంగా 400పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 8700కు చేరువయింది.
లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 416 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 181 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,697కు చేరింది. వీరిలో 3,170మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 5,391మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 132 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read: కరోనా కట్టడకోసం ‘కఫసుర’.. ఐదు రోజుల్లోనే..