కరోనా ఎఫెక్ట్: అడవిలోనే వనవాసం చేస్తున్న కుటుంబం..

కోవిద్-19 మహమ్మారి ప్ర‌పంచ‌వ్యాప్తంగా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ కుటుంబం అడవి బాట పట్టింది. ప్రజల మధ్య నివసిస్తే వైరస్ సోకే ప్రమాదం ఉందనే భయంతో సామాజిక దూరం పాటించడమే ఉత్తమం అని భావించారు.

  • Tv9 Telugu
  • Publish Date - 5:10 pm, Fri, 17 April 20
కరోనా ఎఫెక్ట్: అడవిలోనే వనవాసం చేస్తున్న కుటుంబం..

కోవిద్-19 మహమ్మారి ప్ర‌పంచ‌వ్యాప్తంగా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ కుటుంబం అడవి బాట పట్టింది. ప్రజల మధ్య నివసిస్తే వైరస్ సోకే ప్రమాదం ఉందనే భయంతో సామాజిక దూరం పాటించడమే ఉత్తమం అని భావించారు. దీంతో సమాజానికి దూరంగా అడవుల్లోకి వెళ్లిపోయారు. అక్కడే చెట్ల మధ్య చిన్న ట్రీ హౌస్ ఏర్పాటు చేసుకుని కాపురం చేస్తున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని పుత్తూర్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. వివేక్ అల్లవా అనే వ్యక్తి గత వారం రోజులుగా తన కుటుంబంతో కలిసి అడవిలోనే ఉంటున్నాడు. తన ఇంటికి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో ట్రీ హౌస్ నిర్మించాడు. దానిపైకి ఎక్కేందుకు ఓ నిచ్చెన కూడా తయారు చేశాడు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. ‘‘సామాజిక దూరాన్ని పాటించడానికి ఇదే మంచి మార్గమని భావించాను. గత వారం రోజుల నుంచి మేము ఇక్కడే ఉన్నాం. ఇక్కడికి ఎవరూ రావడం లేదు. ఇళ్లల్లో ఉండేవారు బయటకు రాకపోవడమే ఉత్తమం. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఇంతకంటే మంచి మార్గం లేదు’’ అని తెలిపాడు.

కాగా.. ఉత్తరప్రదేశ్‌లో కూడా ఓ లాయర్ ఈ విధంగానే చెట్టుపై నివసిస్తున్నాడు. హపూర్‌లోని అసురా గ్రామంలో నివసిస్తున్న ముకుల్ త్యాగీ సామాజిక దూరం కాగా.. పాటించేందుకు ఓ చెట్టుపై తాత్కాలిక విడిది ఏర్పాటు చేసుకున్నాడు. కుటుంబాన్ని కూడా కలవకుండా ఒంటరిగా ఆ చెట్టు మీదే నివసిస్తున్నాడు.

Also Read: లాక్‌డౌన్ ఎఫెక్ట్: 3.31 లక్షల పీఎఫ్ క్లైమ్స్ క్లియర్..