కర్నాటక రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్‌‌పై విచారణ రేపటికి వాయిదా..

కర్నాటక రాజకీయం నేటితో అటో ఇటో తేలిపోయే పరిస్థితి ఏర్పడింది. రెబల్స్ ఎమ్మెల్యేలందరూ ఈరోజు సాయంత్రంలోపు స్పీకర్‌ను కలవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా, రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు కూడా సాయంత్రం 6 గంటల లోపు స్పీకర్ ముందుకు వెళ్లాలని సూచించింది. ఆ తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చని సూచించింది. ఎమ్మెల్యేలకు భద్రత కల్పించాలని డీజీపీని ధర్మాసనం ఆదేశించింది. అవసరం ఉంటే దీనికి సంబంధించిన తదుపరి విచారణ రేపు చేపడతామని కోర్టు వెల్లడించింది. తమ రాజీనామాలను వెంటనే ఆమోదించేలా […]

కర్నాటక రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్‌‌పై విచారణ రేపటికి వాయిదా..
Follow us

| Edited By:

Updated on: Jul 11, 2019 | 12:40 PM

కర్నాటక రాజకీయం నేటితో అటో ఇటో తేలిపోయే పరిస్థితి ఏర్పడింది. రెబల్స్ ఎమ్మెల్యేలందరూ ఈరోజు సాయంత్రంలోపు స్పీకర్‌ను కలవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా, రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు కూడా సాయంత్రం 6 గంటల లోపు స్పీకర్ ముందుకు వెళ్లాలని సూచించింది. ఆ తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చని సూచించింది. ఎమ్మెల్యేలకు భద్రత కల్పించాలని డీజీపీని ధర్మాసనం ఆదేశించింది. అవసరం ఉంటే దీనికి సంబంధించిన తదుపరి విచారణ రేపు చేపడతామని కోర్టు వెల్లడించింది.

తమ రాజీనామాలను వెంటనే ఆమోదించేలా స్పీకర్‌కు ఆదేశాలివ్వాలంటూ పది మంది కర్ణాటక ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ పిటిషన్ దాఖలు చేశారు. తాము స్వచ్ఛందంగా రాజీనామాలు ఇస్తే స్పీకర్ ఆమోదించకుండా ఆలస్యం చేస్తున్నారని, 12వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతుంటే తమను కూడా అదేరోజు కలవాలని ఆదేశించడం వెనుక దురుద్దేశం ఉందని రెబెల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్‌ అత్యవసరంగా భావించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ దీనిపై విచారణ జరిపి.. ఈరోజు సాయంత్రమే స్పీకర్ రమేష్‌కుమార్ ఎదుట హాజరుకావాలని సూచించింది.