సిగరెట్లు మానేసిన సొమ్ముతో ఇల్లు కట్టిన పెద్దాయన

సరదా మొదలైన అలవాటు చచ్చేదాకా పోదంటారు. కానీ, మనిషి తలచుకుంటే కానిదీ ఏముంది.. మనసు నిగ్రహంతో ఉంటే ఏ అలవాటునైనా మానుకోవచ్చని నిరూపించాడు కేరళకు చెందిన ఈ పెద్దాయన. తన చెడు వ్యసనాన్ని మానుకుని ఆ సొమ్ముతో బిల్డింగే కట్టేస్తున్నాడు. తనలా దురలవాటుకు దూరంగా ఉంటే ఆర్థికంగా బాగుపడుతారంటూ హితవు పలుకుతున్నాడు.

సిగరెట్లు మానేసిన సొమ్ముతో ఇల్లు కట్టిన పెద్దాయన
Follow us

|

Updated on: Aug 06, 2020 | 5:43 PM

సరదా మొదలైన అలవాటు చచ్చేదాకా పోదంటారు. కానీ, మనిషి తలచుకుంటే కానిదీ ఏముంది.. మనసు నిగ్రహంతో ఉంటే ఏ అలవాటునైనా మానుకోవచ్చని నిరూపించాడు కేరళకు చెందిన ఈ పెద్దాయన. తన చెడు వ్యసనాన్ని మానుకుని ఆ సొమ్ముతో బిల్డింగే కట్టేస్తున్నాడు. తనలా దురలవాటుకు దూరంగా ఉంటే ఆర్థికంగా బాగుపడుతారంటూ హితవు పలుకుతున్నాడు.

ధూమపానం చేయకండి. చేయనీయకండి…. అంటూ ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు ఎన్ని ప్రకటనలు, అవగాహనలు చేపట్టిన ఆ మహమ్మారి బారిన పడేవారి సంఖ్య మాత్రం తగ్గడంలేదు. అయితే కేరళకు చెందిన ఒక వ్యక్తి సిగరెట్ వ్య‌స‌నాన్ని విడిచిపెట్టి, ఈ విధంగా దాచిన సొమ్ముతో ఏకంగా ఇల్లు మీద ఇల్లు క‌డుతున్నాడు. కేర‌ళ‌లోని కోజికోడ్‌ ప్రాంతానికి చెందిన నాయ‌ర్‌ వయసు 75 సంవత్సరాలు. నిర్మాణ రంగంలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. వేణుగోపాల్ నాయర్ నిత్యం సిగ‌రెట్ తాగే అలవాటు ఉంది. దానికి మరి బానిస అయిపోయాడు. నాయ‌ర్‌ త‌న‌కు 13 ఏళ్ల‌ వయస్సు ఉన్న‌ప్ప‌టి నుంచే ధూమపానం మొద‌లుపెట్టాడు. అయితే 67 సంవత్సరాల వయస్సులో అతనికి ఛాతీ నొప్పి రావడంతో ధూమపానం మానేయవలసి వచ్చింది. ఇది ఆరోగ్యానికి హానిక‌ర‌మ‌ని గ్ర‌హించి, ఈ అల‌వాటు మెల్లగా మానుకోవాలనుకున్నాడు. దీంతో సిగ‌రెట్ వ్య‌స‌నానికి స్వ‌స్తి చెప్పేశాడు. గత ఎనిమిదేళ్లుగా సిగరెట్ జోలికే వెళ్లడం మానేశాడు. రోజు సిగరేట్ కు ఖర్చు పెట్టే సొమ్మునంతా ఒకచోట జమ చేశాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు రూ. 5 లక్షలు ఆదా చేశాడు. ఈ మొత్తంతో నాయ‌ర్‌ తన ఇంటిపై మ‌రో అంతస్తు నిర్మిస్తున్నాడు. అంత‌కు ముందు నాయ‌ర్ రోజుకు ఒకటిన్నర ప్యాకెట్ల సిగరెట్లు తాగేవాడు. ఆ సమయంలో ఒక సిగరెట్‌ ప్యాకెట్‌ విలువ 50 రూపాయలు. ఎనిమిది ఏళ్ల‌పాటు ధూమపానం మానివేసి, రూ. 5 లక్షలు ఆదా చేశాడు. ఆ సొమ్ముతో ఇప్పుడు ఇల్లు క‌ట్టిస్తున్నాడు.