కార్ డిజైనర్ దిలీప్ చాబ్రియాపై ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ ఫిర్యాదు, రూ. 5.5 కోట్ల చీటింగ్.

కార్ల డిజైనర్ దిలీప్ ఛాబ్రియాపై ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వానిటీ వ్యాన్ ను డిజైన్ చేస్తానంటూ తన నుంచి రూ. 5. 5 కోట్లు వసూలు చేసి..

  • Umakanth Rao
  • Publish Date - 6:39 pm, Thu, 7 January 21
కార్ డిజైనర్ దిలీప్ చాబ్రియాపై ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ ఫిర్యాదు, రూ. 5.5 కోట్ల చీటింగ్.

కార్ల డిజైనర్ దిలీప్ ఛాబ్రియాపై ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వానిటీ వ్యాన్ ను డిజైన్ చేస్తానంటూ తన నుంచి రూ. 5. 5 కోట్లు వసూలు చేసి కూడా ఆ వాహనాన్ని ఛాబ్రియా  డెలివరీ చేయలేదని ఆయన ఆరోపించారు.  గురువారం మధ్యాహ్నం కపిల్ శర్మ ముంబైలోని సీపీ పరమ్ బీర్ సింగ్ ను, క్రైమ్ ఇంటలిజెన్స్ యూనిట్ కి చెందిన అధికారులను కలిసి  దిలీప్  మోసంపై వాంగ్మూలమిచ్చారు. దిలీప్ ఛాబ్రియా స్కామ్ గురించి, అతని అరెస్టు గురించి తను వార్తా పత్రికల ద్వారా తెలుసుకున్నానని, దీంతో ఇప్పుడు ఫిర్యాదు చేయడానికి వచ్చానని ఆయన తెలిపారు. లోగడ కూడా ఆర్థిక నేరాల నిరోధాల విభాగానికి నేను కంప్లయింట్ చేశా అని కపిల్ శర్మ పేర్కొన్నారు. కానీ ఫలితం లేకపోయిందని పరోక్షంగా వ్యాఖ్యానించారు.

దిలీప్ చాబ్రియా పోలీస్ కస్టడీని కోర్టు ఈ నెల 7 వరకు పొడిగించిన  విషయం  విదితమే.

 

Also Read:

ఏపీలో ఆంగ్లభాషా నైపుణ్యం పెంచే దిశగా ముందడుగు, కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీ- పట్టణాభివృద్ధిశాఖ మధ్య ఎంఓయూ

Emergency for Tokyo area: జపాన్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. టోక్యో సహా పరిసర ప్రాంతాల్లో ఎమర్జెన్సీ..!

మేఘా ఇంజినీరింగ్ సామాజిక బాధ్యత, అత్యున్నత సౌకర్యాలతో నిమ్స్‌లో నిర్మించిన ఆంకాలజీ బ్లాక్ 9న ప్రారంభం