అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కాన్యే వెస్ట్ పోటీ నిజమా ? ఆషామాషీయా ?

అమెరికా అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, ప్రెసిడెంట్ ట్రంప్ ను ఎదుర్కొంటానని ప్రకటించిన ర్యాపర్ కాన్యే వెస్ట్.. నిజంగానే ఎన్నిల బరిలో నిలుస్తాడా లేక ఇదంతా ఉత్తుత్తి వ్యవహారమేనా అన్న వ్యాఖ్యలు..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కాన్యే వెస్ట్ పోటీ నిజమా ? ఆషామాషీయా ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 21, 2020 | 4:13 PM

అమెరికా అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, ప్రెసిడెంట్ ట్రంప్ ను ఎదుర్కొంటానని ప్రకటించిన ర్యాపర్ కాన్యే వెస్ట్.. నిజంగానే ఎన్నిల బరిలో నిలుస్తాడా లేక ఇదంతా ఉత్తుత్తి వ్యవహారమేనా అన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. ఇందుకు కారణం 43 ఏళ్ళ ఇతని మెంటల్ హెల్త్ గురించి వస్తున్న వార్తలే ! ఆదివారం సౌత్ సౌత్ కెరొలినాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కాన్యే..కన్నీటి పర్యంతమవుతూ.. తన వ్యక్తిగత జీవితం  గురించి ప్రస్తావించాడు. తన భార్య కిమ్ కర్దాషియన్ గర్భవతిగా ఉండగా అబార్షన్ చేసుకోవాలని కోరానని, కానీ నిరాకరించి  ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చిందని అన్నాడు. (ఆ బాలిక పేరు నార్త్.. ఆ తరువాత ఈ జంట ఇద్దరు,ముగ్గురు పిల్లలను దత్తత తీసుకున్నారు). తన తండ్రి కూడా తనను వదిలించుకోగోరాడని, అయితే తన తల్లి తనను రక్షించిందని కాన్యే చెప్పాడు. ‘నేను నా కూతురిని దాదాపు చంపినంత పని చేశాను’ అని కేకలు పెట్టాడు. ‘ఇతని స్పీచ్ అంతా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ‘ఒక బేబీని కలిగిన ఎవరికైనా లక్షలాది డాలర్లు వస్తాయి’ అని కూడా సందర్భం లేని మాటలు మాట్లాడాడు.

తన ఎన్నికల ప్రచారం ఊసెత్తని ఈ ర్యాపర్.. గతంలో ట్రంప్ కి తన మద్దతు ప్రకటించాడు.( 2018 లో ఓవల్ ఆఫీసులో ఆయనను కలుసుకున్నాడు.) అయితే తాజాగా  ఇతని ప్రవర్తన ఎన్నికల రేసునుంచి తప్పుకుంటున్నాడన్న రూమర్లకు ఊతమిచ్చింది. పైగా ప్రెసిడెన్షియల్ బ్యాలట్ కి సంబంధించి పలు రాష్ట్రాల్లో తన డెడ్ లైన్ ని కాన్యే చేజార్చుకున్నాడు. ఓక్లహామా లోని బ్యాలట్ పత్రంలో మాత్రమే లిస్టులో ఇతని పేరు ఉంది. సోమవారం రాత్రి కూడా తన భార్య కిమ్ కర్దాషియన్.. తనను ఓ  డాక్టర్ తో బాటు గదిలో నిర్బంధించాలనుకుందని కాన్యే వెస్ట్ పేర్కొన్నాడు. ఇదంతా చూస్తుంటే.. ఎన్నికల బరిలో ఇతగాడు నిలవడమన్నది ఆషామాషీ వ్యవహారమేనని, ఇదంతా షో మాత్రమేనని వెల్లడవుతోంది.