కొత్త నినాదం ఎత్తుకున్న కంగనా..

భారత సైనికులను పొట్టన పెట్టుకున్న చైనాపై ప్రతీకారం తీర్చుకోవాలంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు నెటిజన్లు. ఆ దేశానికి బుద్ధి చెప్పాల్సిందేనంటూ ''బైకాట్ చైనా ప్రాడక్ట్స్''..

  • Sanjay Kasula
  • Publish Date - 5:56 am, Sun, 28 June 20
కొత్త నినాదం ఎత్తుకున్న కంగనా..

భారత సైనికులను పొట్టన పెట్టుకున్న చైనాపై ప్రతీకారం తీర్చుకోవాలంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు నెటిజన్లు. ఆ దేశానికి బుద్ధి చెప్పాల్సిందేనంటూ ‘బైకాట్ చైనా’ పేరుతో పెద్ద ఉద్యమాన్ని నడుపుతున్నారు సోషల్ మీడియాలో చాలా మంది. చైనా ఉత్పత్తులను, యాప్స్ ను నిషేధించాలని కోరుతున్నారు. ఇదే  నినాదాన్ని ఎత్తుకున్నారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఈ సమయంలో మనందరం ఏకతాటిపైకి వచ్చి, సంఘటితంగా చైనాపై యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు.

భారత దేశం దాస్య శృంఖలాలను  తొలిగించేందుకు బ్రిటీష్ వస్తువులను బహిష్కరించారని… ఇప్పుడు చైనా వస్తువులను బహిష్కరిద్దామని తన ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చారు. మరోవైపు ఇన్స్టాగ్రామ్ ద్వారా కంగనా ఈ పిలుపునిచ్చిన గంటల వ్యవధిలోనే దాదాపు రెండు లక్షల వ్యూస్ వచ్చాయి. కంగనా పిలుపుకు ఆమె అభిమానులు పెద్ద ఎత్తున మద్దతును ప్రకటిస్తున్నారు.