తాగొచ్చే భర్తలకు ఇలా బుద్ది చెప్పండి.. మహిళలకు కేఏ పాల్ చిట్కా…

తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలపై మ‌త ప్ర‌భోద‌కుడు, ప్రజాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ ఫైర‌య్యాడు. ఓ ఫ్రెండ్ తనకు కాల్ చేసి హార్ట్ బ్రేకింగ్ న్యూస్ చెప్పాడని.. మందు తాగడానికి లిక్కర్ షాపులు ఓపెన్ చేయడం క‌రెక్ట్ కాద‌న్నారు. ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధమని చెప్పారని.. ఇప్పుడు ఆ హామీ ఏమైందని ప్ర‌శ్నించారు. మ‌హ‌మ్మారి క‌రోనావైర‌స్ తో ప్ర‌జ‌లు చనిపోతుంటే లిక్క‌ర్ షాపుల‌కు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. లిక్కర్ షాపుల దగ్గర పౌరులు భౌతిక దూరం […]

  • Ram Naramaneni
  • Publish Date - 5:12 pm, Wed, 6 May 20
తాగొచ్చే భర్తలకు ఇలా బుద్ది చెప్పండి.. మహిళలకు కేఏ పాల్ చిట్కా...

తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలపై మ‌త ప్ర‌భోద‌కుడు, ప్రజాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ ఫైర‌య్యాడు. ఓ ఫ్రెండ్ తనకు కాల్ చేసి హార్ట్ బ్రేకింగ్ న్యూస్ చెప్పాడని.. మందు తాగడానికి లిక్కర్ షాపులు ఓపెన్ చేయడం క‌రెక్ట్ కాద‌న్నారు. ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధమని చెప్పారని.. ఇప్పుడు ఆ హామీ ఏమైందని ప్ర‌శ్నించారు. మ‌హ‌మ్మారి క‌రోనావైర‌స్ తో ప్ర‌జ‌లు చనిపోతుంటే లిక్క‌ర్ షాపుల‌కు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. లిక్కర్ షాపుల దగ్గర పౌరులు భౌతిక దూరం పాటించడం లేదని.. ఈ నిర్ణ‌యం ద్వారా నష్టం తప్ప ఒక్క లాభం అయినా ఉందా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

జనాలు క్యూ లైన్లలో ఫిజిక‌ల్ డిస్టెన్స్ పాటించకుండా నిలబడితే కోవిడ్-19 వచ్చే ప్రమాదం ఉందన్నారు పాల్. వారి నుంచి కుటుంబ సభ్యుల‌కు కూడా వ్యాధి అంటుకునే ప్రమాదం ఉందన్నారు. లాక్‌డౌన్ కఠినంగా అమలు చేయాల్సిన స‌మ‌యంలో.. మద్యం షాపులకు ఎలా ప‌ర్మిష‌న్ ఇస్తారుని ప్రశ్నించారు. డ‌బ్బుల కోస‌మే ప్ర‌భుత్వాలు ఈ ప‌ని చేశాయ‌ని దుయ్య‌బ‌ట్టారు.

తాగేవాళ్ల‌కు దాతలు ఉచితంగా అందజేసి ఆహారాన్ని నిలిపివేయాలని కోరారు. ఫ్రీ రేషన్ ఆపివేసి… మద్యం తాగినవాళ్ల చేతులకు చుక్కలు పెట్టాలన్నారు. తాగొచ్చే భ‌ర్త‌ల‌కు ఆడవాళ్లు బుద్ది చెప్పాలని.. తిండి పెటవ‌ద్ద‌ని, అవసరమైతే కొట్టండి అంటూ పిలుపునిచ్చారు పాల్.