తెలంగాణాలో ఎన్ కౌంటర్.. సీజేఐ సంచలన వ్యాఖ్యలు

  ఎక్స్ ట్రా జుడిషియల్ కిల్లింగ్స్ (ఎన్ కౌంటర్స్ ) ని పాటించే విధానాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే ఖండించారు. న్యాయం పగ రూపాన్ని సంతరించుకుంటే అది తన రూపురేఖలను కోల్పోతుందని వ్యాఖ్యానించారు. ‘ సత్వర న్యాయం అన్నది సరికాదు ‘ అని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణాలో దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ గురించి పరోక్షంగా ప్రస్తావించిన ఆయన.. ఇది సత్వర పరిష్కారమవుతుందని తాను భావించడంలేదన్నారు. జస్టిస్ రివేంజ్ రూపాన్ని సంతరించుకుంటే.. అది […]

తెలంగాణాలో ఎన్ కౌంటర్.. సీజేఐ సంచలన వ్యాఖ్యలు

 

ఎక్స్ ట్రా జుడిషియల్ కిల్లింగ్స్ (ఎన్ కౌంటర్స్ ) ని పాటించే విధానాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే ఖండించారు. న్యాయం పగ రూపాన్ని సంతరించుకుంటే అది తన రూపురేఖలను కోల్పోతుందని వ్యాఖ్యానించారు. ‘ సత్వర న్యాయం అన్నది సరికాదు ‘ అని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణాలో దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ గురించి పరోక్షంగా ప్రస్తావించిన ఆయన.. ఇది సత్వర పరిష్కారమవుతుందని తాను భావించడంలేదన్నారు. జస్టిస్ రివేంజ్ రూపాన్ని సంతరించుకుంటే.. అది తన రూపు రేఖలనే కోల్పోతుంది.. ఇదే జరిగితే దీని ‘ క్యారక్టర్ ‘ మరుగున పడినట్టే.. అన్నారాయన. శనివారం జైపూర్ లో నూతన రాజస్థాన్ హైకోర్టు భవనానికి జస్టిస్ బాబ్డే ప్రారంభోత్సవం చేశారు. అయితే ఈ దేశ న్యాయవ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్న విషయం నిజమేనని ఆయన అంగీకరించారు. వీటిని వెంటనే సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను తిరిగి పరిశీలించవలసిన ఆవశ్యకత ఉందని, కేసుల విచారణ త్వరగా ముగియాలంటే.. టెక్నాలజీని మరింతగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ప్రత్యామ్నాయ పరిష్కార వ్యవస్థలు కూడా ఇందుకు తోడ్పడతాయని ఆయన పేర్కొన్నారు. భారత అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిగా ఆయన గత నెలలో బాధ్యతలు చేబట్టిన సంగతి విదితమే.