యంగ్ టైగర్ ఎమోషనల్

దివంగ‌త న‌టుడు నంద‌మూరి హ‌రికృ‌ష్ణ 64వ జ‌యంతి నేడు. ఈ సంద‌ర్భంగా తండ్రిని త‌లచుకొని హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్, ఆయన సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ ఒకింత భావోద్వేగానికి లోన‌య్యారు. ఆ బాధను ట్విట్టర్ వేదికగా..

  • Pardhasaradhi Peri
  • Publish Date - 2:42 pm, Wed, 2 September 20
యంగ్ టైగర్ ఎమోషనల్

దివంగ‌త న‌టుడు నంద‌మూరి హ‌రికృ‌ష్ణ 64వ జ‌యంతి నేడు. ఈ సంద‌ర్భంగా తండ్రిని త‌లచుకొని హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్, ఆయన సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ ఒకింత భావోద్వేగానికి లోన‌య్యారు. ఆ బాధను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ‘ఈ అస్థిత్వం మీరు. ఈ వ్య‌క్తిత్వం మీరు. మొక్క‌వోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్ర‌స్థానానికి నేతృత్వం మీరు. ఆజ‌న్మాంతం త‌లుచుకునే అశ్రుక‌ణం మీరే – నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, నంద‌మూరి తార‌క రామారావు’ అంటూ సందేశం ఉన్న ఒక పోస్టును ‘మిస్ యు నాన్న’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో అప్ లోడ్ చేశారు.

దివంగత నంద‌మూరి తార‌క‌రామారావు వార‌సుడిగా, న‌టుడిగానూ, రాజ‌కీయ నాయ‌కుడిగా హ‌రికృ‌ష్ణ తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. వెండితెర‌పై సీత‌య్య‌గా వెలుగొందారు. 2018లో నల్గొండ జిల్లా అన్నెపర్తి దగ్గర జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో హ‌రికృ‌ష్ణ మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. సెప్టెంబరు 2, 1956 న ఎన్. టి. ఆర్, బసవతారకం దంపతులకు మూడో సంతానంగా హ‌రికృ‌ష్ణ జన్మించారు.