ఆర్టికల్ 370… ఫలించిన జోఫ్రా ఆర్చర్ జోస్యం!

జోఫ్రా ఆర్చర్.. ఈ పేరు ఇంగ్లండ్‌లో కంటే.. ఇప్పుడు ఇండియాలో చాలా ఫేమస్ అవుతోంది. అందుకు కారణం అతను గతంలో చేసిన ట్వీట్లే.  ఇటీవల నిషేధానికి గురైన టీం ఇండియా యువ క్రికెటర్ పృథ్వీ షా గురించి ఆర్చర్ గతంలోనే ట్వీట్ చేయడంతో అవాక్కైన నెటిజన్లు.. ఈరోజు కేంద్రం రద్దు చేసిన ఆర్టికల్ 370 గురించి కూడా ఆర్చర్ ట్వీట్ చేయడం చూసి మరింత షాక్ అవుతున్నారు. జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ.. […]

ఆర్టికల్ 370... ఫలించిన జోఫ్రా ఆర్చర్ జోస్యం!
Follow us

| Edited By:

Updated on: Aug 05, 2019 | 9:33 PM

జోఫ్రా ఆర్చర్.. ఈ పేరు ఇంగ్లండ్‌లో కంటే.. ఇప్పుడు ఇండియాలో చాలా ఫేమస్ అవుతోంది. అందుకు కారణం అతను గతంలో చేసిన ట్వీట్లే.  ఇటీవల నిషేధానికి గురైన టీం ఇండియా యువ క్రికెటర్ పృథ్వీ షా గురించి ఆర్చర్ గతంలోనే ట్వీట్ చేయడంతో అవాక్కైన నెటిజన్లు.. ఈరోజు కేంద్రం రద్దు చేసిన ఆర్టికల్ 370 గురించి కూడా ఆర్చర్ ట్వీట్ చేయడం చూసి మరింత షాక్ అవుతున్నారు.
జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ.. ఆర్టికల్ 370ని కేంద్రం తొలగించింది. అయితే 2014, మే 26వ తేదీన ‘ఈ రోజుల్లో 370 కూడా సురక్షితం కాదు(ఈవెన్ 370 ఈజ్ నాట్ సేఫ్ దీజ్ డేస్)’ అంటూ ఆర్చర్ ట్వీట్ చేశాడు. ఆ రోజే మొదటిసారిగా ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేయడం మరో విశేషం. దీంతో నెటిజన్లు ఆర్చర్‌కి జేజేలు కొడుతున్నారు. ‘ఆర్చర్ బాబాకి జై’ అంటూ ఒక వ్యక్తి ట్వీట్ చేయగా.. ‘‘ఆర్టికల్ 370 గురించి ఆర్చర్ జోతిష్కుడిలా చెప్పాడు’’ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. ఆర్చర్ చేసిన  ట్వీట్ సోషల్‌మీడియాలో వైరల్అవుతోంది.

[svt-event date=”05/08/2019,9:26PM” class=”svt-cd-green” ]

[/svt-event]