జీరో ఫాలోవర్లతో ప్రారంభం కానున్న జో బైడెన్ ట్విటర్ ఖాతా, 20 న ‘పోటస్’ అకౌంట్ గా మారనున్న సామాజిక మాధ్యమం

జీరో ఫాలోవర్లతో ప్రారంభం కానున్న జో బైడెన్ ట్విటర్ ఖాతా, 20 న 'పోటస్' అకౌంట్ గా మారనున్న సామాజిక మాధ్యమం

ఈ నెల 20 న అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్ పదవి చేపట్టగానే ఆయనకు సంబంధించి ట్విటర్ కొత్త అకౌంట్ ప్రారంభం కానుంది. అయితే దానిని ఇక 'పోటస్..

Umakanth Rao

| Edited By: Ram Naramaneni

Jan 17, 2021 | 5:32 PM

ఈ నెల 20 న అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్ పదవి చేపట్టగానే ఆయనకు సంబంధించి ట్విటర్ కొత్త అకౌంట్ ప్రారంభం కానుంది. అయితే దానిని ఇక ‘పోటస్’ అకౌంట్ గా వ్యవహరించనున్నారు. నిజానికి మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా  హయాం నుంచి ఈ పోటస్ ట్విటర్ విధానం అమలులోకి వచ్చింది. కానీ వైట్ హౌస్ వర్గాలు దీనిపై అసంతృప్తిని వ్యక్తం చేశాయి. బైడెన్ వ్యక్తిగత ట్విటర్ ఖాతాలో మాత్రం ఆయనకు 24 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ నెల 20 న  బైడెన్ ప్రభుత్వానికి ట్విటర్ తన అధికారిక లాంఛనాలను అందజేయనుంది. కానీ జీరో ఫాలోవర్లతో ఇది లాంచ్ అవుతుంది. 2016 లో ట్రంప్ ప్రభుత్వం ట్విటర్ ఖాతాలను ఆయనకు అందజేయలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన నిర్ణయం ట్విటర్ కు, బైడెన్ ట్రాన్సిషన్ టీమ్ కి మధ్య ఆందోళన కలిగించే అంశంగా మారింది. అయితే తన ఫాలోవర్స్ గురించి బైడెన్ అంతగా ఆలోచించడం లేదని, దేశంలో ప్రతివారితోనూ కాంటాక్ట్ లో ఉండాలన్నదే ఆయన అభిమతమని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అటు-ట్రంప్ ఖాతాను ట్విటర్ స్తంభింపజేయక ముందు ఆయనకు 88 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉంటూ వచ్చారు.

ఇక వైట్ హౌస్ కొత్త అధ్యక్షునికి స్వాగతం పలకడానికి సమాయత్తమవుతోంది. ఈ శ్వేత సౌధంలో చాలామంది ఇండియన్ అమెరికన్లే ఉండడంతో దీనికి సగం భారతీయత అబ్బింది. కాగా ట్రంప్ ఈ సౌధంలో తనకు సంబంధించిన వస్తువులను, ఇతరాలను సేకరించి తీసుకువెళ్లే పనిలో ఉన్నారు.

Also Read:

Crime News: పెళ్లి చేసుకుంటానన్న తనయుడు.. ఆగ్రహించిన తండ్రి.. ఇంట్లోంచి గొడ్డలి తీసుకొచ్చి…

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విరాళం, ప్రతివారూ డొనేట్ చేయాలని విన్నపం

భారీ డిస్కౌంట్ ప్రకటించిన మహీంద్రా అండ్ మహీంద్రా.. ఒక్కో వాహనంపై ఎంత తగ్గింపు అంటే…

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu