కేసీఆర్ సంచలన నిర్ణయం..ఆత్యహత్య చేసుకున్న ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబీకులకు ఉద్యోగాలు

కేసీఆర్ సంచలన నిర్ణయం..ఆత్యహత్య చేసుకున్న ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబీకులకు ఉద్యోగాలు

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 52 రోజులపాటు సుదీర్ఘకాలం సాగిన సంగతి తెలిసిందే. ఎన్ని ప్రయత్నాలు చేసినా పభుత్వం మెట్లు దిగకపోయేసరికి… సమ్మె సమయంలో ఉద్యోగులు తీవ్ర భావోద్వేగాలకి గురయ్యారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు.  సమ్మె విరమించామని జేఏసీ ప్రకటించిన తర్వాత కూడా ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకునే విషయంలో సీఎం కేసీఆర్ సమాలోచనలు చేశారు. ఎట్టకేలకు ఎటువంటి షరతులు లేకుండా ఉద్యోగులందర్ని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సంతోషంగా తమ, తమ విధుల్లో జాయిన్ […]

Ram Naramaneni

| Edited By:

Dec 06, 2019 | 9:47 PM

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 52 రోజులపాటు సుదీర్ఘకాలం సాగిన సంగతి తెలిసిందే. ఎన్ని ప్రయత్నాలు చేసినా పభుత్వం మెట్లు దిగకపోయేసరికి… సమ్మె సమయంలో ఉద్యోగులు తీవ్ర భావోద్వేగాలకి గురయ్యారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు.  సమ్మె విరమించామని జేఏసీ ప్రకటించిన తర్వాత కూడా ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకునే విషయంలో సీఎం కేసీఆర్ సమాలోచనలు చేశారు. ఎట్టకేలకు ఎటువంటి షరతులు లేకుండా ఉద్యోగులందర్ని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సంతోషంగా తమ, తమ విధుల్లో జాయిన్ అయ్యారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని రక్షించేందుకు వెంటనే రూ. 100 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. అంతేకాదు టికెట్ ధరలు పెంచుకునేందకు కూడా ఆర్టీసీకి అనుమతిచ్చింది.

తాజాగా సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.  సమ్మె సమయంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు సంబంధించిన 10 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో చనిపోయిన 10 కుటుంబాల్లోని ఒక్కొక్కరి చొప్పున ఉద్యోగం కల్పించారు. ఒకరికి కండక్టర్​గా అవకాశం కల్పించగా, నలుగురికి జూనియర్ అసిస్టెంట్‌, ఐదుగురికి  పోలీసు కానిస్టేబుళ్లుగా అవకాశం ఇచ్చారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu