విద్యార్థులకు ముఖ్య గమనిక.. సిలబస్ కుదింపుపై జేఎన్టీయూ కీలక ప్రకటన.!

విద్యార్ధులపై ఒత్తిడి లేకుండా 2020-21 సంవత్సరానికి సిలబస్ తగ్గిస్తారని పలు వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా జేఎన్టీయూహెచ్ స్పందించింది.

  • Ravi Kiran
  • Publish Date - 12:29 pm, Tue, 3 November 20
విద్యార్థులకు ముఖ్య గమనిక.. సిలబస్ కుదింపుపై జేఎన్టీయూ కీలక ప్రకటన.!

JNTUH Key Decision: కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా విద్యార్థులు పూర్తిగా నష్టపోయారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం(2020-21) జూన్‌లో మొదలు కావాల్సి ఉండగా.. మహమ్మారి వల్ల అది కాస్తా వాయిదా పడింది. అయితే ఇప్పుడు దేశమంతా అన్‌లాక్ ప్రక్రియ మొదలు కావడంతో స్కూల్స్, పాఠశాలలు, విద్యాసంస్థలు పున: ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్ధులపై ఒత్తిడి లేకుండా 2020-21 సంవత్సరానికి సిలబస్ తగ్గిస్తారని పలు వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా జేఎన్టీయూహెచ్ స్పందించింది.

ఇంజినీరింగ్ 2020-21 సంవత్సరానికి గాను సిలబస్ తగ్గించకూడదని నిర్ణయించినట్లు జేఎన్టీయూ పేర్కొంది. సిలబస్ కుదించకుండా పూర్తిస్థాయిలో బోధిస్తూనే విద్యా సంవత్సరం పూర్తి చేయాలని భావిస్తోంది. దీని కోసం సమ్మర్, ఇతర సెలవులను తగ్గించాలని యోచిస్తోంది. కాగా, డిసెంబర్ 1వ తేదీ నుంచి బీటెక్ తరగతులను ప్రారంభించాలని కసరత్తు చేస్తోంది.

Also Read: కేంద్రం సంచలన నిర్ణయం.. రోడ్డు ప్రమాదాల్లో సాయం చేసినవారికి అవార్డులు..