విద్యార్థులకు శుభవార్త తెలిపిన జేఎన్‌టీయూ హైదరాబాద్.. నచ్చిన చోట పరీక్ష రాసుకునే వెసులుబాటు.

విద్యార్థులు రెండో సెమిస్టర్ పరీక్షలను తమ సొంత ప్రాంతానికి దగ్గరలోని కాలేజీల్లో రాసేందుకు హైదరాబాద్ జేఎన్‌టీయూ యూనివర్సీటీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా విద్యార్థులు...

  • Narender Vaitla
  • Publish Date - 7:26 am, Thu, 24 December 20
విద్యార్థులకు శుభవార్త తెలిపిన జేఎన్‌టీయూ హైదరాబాద్.. నచ్చిన చోట పరీక్ష రాసుకునే వెసులుబాటు.

jntu hyderabad big relief to students: కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రంగాల్లో విద్యా రంగం ఒకటి. పాఠశాలలు, కాలేజీలు మూత పడడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యా సంవత్సరం నష్ట పోకూడదనే ఉద్దేశంతో అన్ని విద్యా సంస్థలు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. క్లాసులు అయితే ఇంటి నుంచి వింటున్నారు కానీ.. పరీక్షల కోసం మాత్రం మళ్లీ పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా బీటెక్ లాంటి డిగ్రీలు చేస్తున్న వారు సొంతూర్ల నుంచి క్లాసులు వింటున్నా పరీక్షల కోసం పట్టణాలకు రావాల్సి వస్తోంది. దీంతో ఇది విద్యార్థులకు తీవ్ర ఇబ్బందిగా మారుతోంది. హాస్టళ్లు మూతపడడంతో పరీక్షలకు హాజరు కాలేక పోతున్నారు.
ఈ సమస్యకు చెక్ పెట్టడానికే హైదరాబాద్ జేఎన్‌టీయూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు రెండో సెమిస్టర్ పరీక్షలను తమ సొంత ప్రాంతానికి దగ్గరలోని కాలేజీల్లో రాసేందుకు యూనివర్సీటీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా విద్యార్థులు వారికి సమీపంలోని మూడు కాలేజీల కోసం ఆప్షన్లను సంబంధిత ప్రిన్సిపల్‌కు సమర్పించాల్సి ఉంటుంది. ఈ మూడు కాలేజీల్లో ఒకటి తప్పక యూనివర్సిటీ గుర్తింపు పొందిన బీటెక్‌ లేదా బీఫార్మసీ కాలేజీ అయి ఉండాలని జేఎన్టీయూ స్పష్టం చేసింది. అనంతరం విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా ఒక కాలేజీని ఎంపిక చేసి పరీక్ష కేంద్రంగా కేటాయిస్తారు. అంతేకాకుండా విద్యార్థులు తాము చదివే కాలేజీల్లోనూ పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించారు. ఇక అంతేకాకుండా రెండో సెమిస్టర్ పరీక్షల సమయాన్ని 80 నిమిషాలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.