యూజర్లకు భారీ షాక్.. కొత్త ప్లాన్స్ ప్రకటించిన జియో!

భారత టెలికాం రంగంలోకి జియో అడుగుపెట్టిన తర్వాత అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. తక్కువ ధరలతో కాల్స్, డేటా వంటివి ఇస్తుండటంతో యూజర్లు జియోకే ఎక్కువగా మొగ్గు చూపారు. దీంతో ఇప్పుడు టెలికాం ఆపరేటర్స్ లిస్ట్‌లో రిలయన్స్ జియో అగ్రస్థానంలో ఉంది. అయితే తాజాగా జియో.. తన యూజర్లపై అధిక ఛార్జీల వడ్డనకు రంగం సిద్ధం చేసింది. కొత్త ధరలతో సరికొత్త ప్లాన్స్‌ను ప్రవేశపెట్టింది. ఇవన్నీ కూడా శుక్రవారం నుంచి అమలులోకి రానున్నాయి. ఇకపోతే అధికశాతం యూజర్లు ఉపయోగిస్తున్న 1.5 […]

  • Ravi Kiran
  • Publish Date - 11:46 am, Thu, 5 December 19
యూజర్లకు భారీ షాక్.. కొత్త ప్లాన్స్ ప్రకటించిన జియో!

భారత టెలికాం రంగంలోకి జియో అడుగుపెట్టిన తర్వాత అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. తక్కువ ధరలతో కాల్స్, డేటా వంటివి ఇస్తుండటంతో యూజర్లు జియోకే ఎక్కువగా మొగ్గు చూపారు. దీంతో ఇప్పుడు టెలికాం ఆపరేటర్స్ లిస్ట్‌లో రిలయన్స్ జియో అగ్రస్థానంలో ఉంది.

అయితే తాజాగా జియో.. తన యూజర్లపై అధిక ఛార్జీల వడ్డనకు రంగం సిద్ధం చేసింది. కొత్త ధరలతో సరికొత్త ప్లాన్స్‌ను ప్రవేశపెట్టింది. ఇవన్నీ కూడా శుక్రవారం నుంచి అమలులోకి రానున్నాయి. ఇకపోతే అధికశాతం యూజర్లు ఉపయోగిస్తున్న 1.5 జీబీతో కూడిన మూడు నెలల ప్లాన్ల ఇకపై రూ.555 చేశారు. అలాగే 2 జీబీతో కూడిన ప్లాన్ రూ.599కి లభించనుంది. కాగా, ఈ ప్లాన్లకు ‘న్యూ ఆల్ ఇన్ వన్’ అని రిలయన్స్ సంస్థ కొత్త పేరు పెట్టింది. ఆలస్యం ఎందుకు ఆ ప్లాన్ల లిస్ట్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి.