జియో వినియోగదారులకు గుడ్ న్యూస్..!

ప్ర‌ముఖ దిగ్గ‌జ నెట్ వ‌ర్క్ కంపెనీ‌ జియో వినియోగ‌దారుల‌ను భారీగా ఆక‌ట్టుకుంటూ ముందుకు సాగుతోంది. తాజాగా క‌స్ట‌మ‌ర్స్ కు ప్రతిరోజూ 2 జీబీ హైస్పీడ్ డేటాను అందిస్తుంది.

  • Ram Naramaneni
  • Publish Date - 9:21 pm, Mon, 29 June 20
జియో వినియోగదారులకు గుడ్ న్యూస్..!

ప్ర‌ముఖ దిగ్గ‌జ నెట్ వ‌ర్క్ కంపెనీ‌ జియో వినియోగ‌దారుల‌ను భారీగా ఆక‌ట్టుకుంటూ ముందుకు సాగుతోంది. తాజాగా క‌స్ట‌మ‌ర్స్ కు ప్రతిరోజూ 2 జీబీ హైస్పీడ్ డేటాను అందిస్తుంది. జియో తన ప్రమోషనల్ ఆఫర్ లో భాగంగా వరుసగా నాలుగు రోజుల పాటు ఈ డేటా అందుబాటులో ఉంచ‌నుంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కూడా కొంతమంది క‌స్ట‌మ‌ర్స్ కు ఈ ఆఫర్ ను కంపెనీ అందించింది. ఇప్పుడు కూడా అంద‌రికీ కాకుండా సెల‌క్టెడ్ వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ ను అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం మీరు 1.5 జీబీ డేటా ప్లాన్ ను వినియోగిస్తుంటే.. ఈ ఆఫ‌ర్ అందుబాటులో ఉంటే మ‌రో 2 జీబీతో కలిపి మొత్తంగా 3.5 జీబీ డేటా వ‌స్తుంది. గతంలో ఈ ఆఫర్ ను ఐదు రోజుల అందించిన జియో..ఇప్పుడు నాలుగు రోజుల‌కు త‌గ్గించింది.

ఈ ప్లాన్ మీ నంబ‌రుకు అందుబాటులో ఉందో లేదో.. మై జియో యాప్ లేదా జియో వెబ్ సైట్లోకి వెళ్లి తెలుసుకోవచ్చు. అందులో మై ప్లాన్స్ ని చెక్ చేసుకుంటే.. అక్కడ జియో డేటా ప్యాక్ అనే ఆప్షన్ కింద మీకు ఈ అదనపు డేటా లభిస్తుంది. జియో సంస్థ‌ ఈ ఆఫర్ ను ఎప్పట్నుంచో తన క‌స్ట‌మ‌ర్స్ కు అందిస్తోంది. 2018 జులై నుంచి స్టార్ట్ చేశారు. అయితే క‌రోనా లాక్ డౌన్ నేప‌థ్యంలో మార్చి నుంచి ప్రతి నెలా చివర్లో ఈ ఆఫర్ ను జియో కొంతమంది క‌స్ట‌మ‌ర్స్ కు మాత్ర‌మే అందిస్తోంది.