Jharkhand encounter: పోలీసులు-మావోయిస్టుల‌కు ఎదురు కాల్పులు.. మావోయిస్టు ఏరియా ద‌ళ క‌మాండ‌ర్ హ‌తం

జార్ఖండ్‌లో నిన్న అర్ధ‌రాత్రి ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసుల‌కు, మావోయిస్టుల‌కు జ‌రిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు ఏరియా ద‌ళ క‌మాండ‌ర్ హ‌తం అయ్యాడు. రాంచీ...

Jharkhand encounter: పోలీసులు-మావోయిస్టుల‌కు  ఎదురు కాల్పులు..  మావోయిస్టు ఏరియా ద‌ళ క‌మాండ‌ర్ హ‌తం
Follow us

|

Updated on: Dec 23, 2020 | 8:31 AM

జార్ఖండ్‌లో నిన్న అర్ధ‌రాత్రి ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసుల‌కు, మావోయిస్టుల‌కు జ‌రిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు ఏరియా ద‌ళ క‌మాండ‌ర్ హ‌తం అయ్యాడు. రాంచీ జిల్లాలోని లోధ్‌మాలో ఉన్న అట‌వీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంట‌ర్ జ‌రిగింది. దీంతో అట‌వీ ప్రాంతంలో భారీగా మోహ‌రించిన పోలీసులు.. మంళ‌వారం సాయంత్రం మావోయిస్టుల కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. అయితే ఛేట్ గ్రాంమ స‌మీపంలో పోలీసు బ‌ల‌గాల‌పై మావోయిస్టులు కాల్పులు జ‌ర‌ప‌డంతో, పోలీసులు మావోల‌పై ఎదురు కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో నిషేధిత పీపుల్స్ లిబ‌రేష‌న్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఏరియా క‌మాండ‌ర్ పున‌రై ఒరాన్ హ‌తం కాగా, మిగితా మావోయిస్టు స‌భ్యులు త‌ప్పించుకుని పారిపోయారు. మావోల కోసం ఆ ప్రాంతంలో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు రాంచీ ఎస్ ఎస్‌పీ సురేంద‌ర్ ఝా తెలిపారు.

కాగా, గ‌త వారం రోజుల కింద‌ట ఖుంటీ స‌మీపంలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో పీఎల్ ఎఫ్ ఐ అగ్ర‌నేత బైడెన్ గుడియా హ‌తం అయ్యాడు. మావోయిస్టు పార్టీ వారం రోజుల వ్య‌వ‌ధిలోనే ఇద్ద‌రు అగ్ర‌నేతల‌ను కోల్పోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. రాంచీ, గుల్మా, ఖుంటీ జిల్లాల్లో పున‌రై ఒరాన్ సుప‌రిచితుడు. అత‌ని త‌ల‌పై రూ.2 ల‌క్ష‌ల రివార్డు కూడా ఉంది. పోలీసులు అత‌ని కోసం చాలాకాలం నుంచి గాలిస్తున్నారు. ఒక్క రాంచీ జిల్లాలోనే 14 కేసులు న‌మోద‌య్యాయి. వ్యాపార‌స్తుల‌ను బెదిరిస్తూ భారీగా వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్నాడ‌నే ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి.

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!