Japanese weight loss trick: బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసి విసిగిపోయారా..? ఈ జపనీస్ ట్రిక్ అద్భుతమట!

Japanese weight loss diet: బరువు పెరగడం సమస్య నుంచి బయటపడటానికి ప్రజలు డబ్బును ఓ రేంజ్‌లో ఖర్చు చేస్తారు. ప్రత్యేకమైన డైట్ ఫాలో అవ్వడం, రోజూ జిమ్‌కు వెళ్లడం వంటివి చేస్తుంటారు

Japanese weight loss trick: బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసి విసిగిపోయారా..? ఈ జపనీస్ ట్రిక్ అద్భుతమట!
Follow us

|

Updated on: Mar 02, 2021 | 11:22 AM

Japanese weight loss trick:  బరువు పెరగడం సమస్య నుంచి బయటపడటానికి ప్రజలు డబ్బును ఓ రేంజ్‌లో ఖర్చు చేస్తున్నారు. ప్రత్యేకమైన డైట్ ఫాలో అవ్వడం, రోజూ జిమ్‌కు వెళ్లడం వంటివి చేస్తుంటారు. కొందరైతే డాక్టర్లను కూడా సంప్రదిస్తూ ఉంటారు.  ఖరీదైన మెడిసిన వాడతారు. మరికొందరు చిన్న చిన్న ఇంటి చిట్కాలు ఫాలో అవుతారు. అయినా కానీ మెరుగైన ఫలితాలు ఉండవు.  కానీ జపనీస్ డైట్ ప్లాన్, టెక్నిక్ ద్వారా బరువు తగ్గడం చాలా ఈజీ అని చెబుతున్నారు.  ఈ పద్దతిని ఫాలో అయితే ఉబకాయం మటుమాయం అవుతుందని అంటున్నారు. ఈ డైట్ ప్రకారం మీరు అరటిని వేడి నీటితో తినడం ద్వారా రోజు ప్రారంభించాలి. జపాన్‌‌లో చాలా మంది ప్రజలు తమ అల్పాహారంగా ఈ ఆహారాన్ని తీసుకుంటున్నారు. దీన్ని ‘ఆసా డైట్’ అంటారు. కాగా, బరువు తగ్గడంలో ఈ ఆహారం ఎంత ప్రభావవంతంగా ఉంటుందో తెలుసుకుందాం.

ఇది ఉభకాయాన్ని నిలువరిస్తుంది.

అరటి మీ జీవక్రియ వ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అరటిలో పిండి పదార్థాలు ఉంటాయి. ఇది చాలా బ్లెడ్ షుగర్‌ను కలిగించే కారకాలను తక్కువగా కలిగి ఉంటుంది. అరటిలోని ఫైబర్ కడుపులో మలబద్దకాన్ని నివారిస్తుంది.

ఆకలిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది..

పిండి పదార్ధాలు,  ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న ఈ ఆహారం రోజంతా మీ శరీరంలో ఏర్పడే కొవ్వు పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అల్పాహారం కోసం అరటితో వేడినీరు తాగడం వల్ల మీ కడుపు చాలా రోజులు ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మీ ఆకలిని కూడా తగ్గిస్తుంది.

దీన్ని ఎలా వాడాలి?

ఉబకాయం తగ్గించడానికి, మొదట ఉదయం లేచి ఒక గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగాలి. అరగంట తరువాత, 2 అరటిపండ్లు మాత్రమే తినాలి. మీ ఆకలి బట్టి  అరటిపండు సంఖ్యను పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు.

ఆహారంలో ఇతర పండ్లు:

దానిమ్మ

దానిమ్మపండు ప్రయోజనాలు అన్నీ, ఇన్నీ కావు. ప్రతిరోజూ ఎర్ర దానిమ్మపండు తినడం వల్ల బరువు తగ్గడమే కాదు, శారీరక బలహీనతను అధిగమించడానికి కూడా ఇది సహాయపడుతుంది. డయాబెటిక్ రోగులకు కూడా ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

యాపిల్స్

యాపిల్స్ ఎరుపు, ఆకుపచ్చ రెండింటి రంగులలో లభ్యమవుతాయి. యాపిల్స్‌లో విటమిన్ సి గుణాలు ఉన్నాయి. ఎర్ర యాపిల్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ పండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అలాగే ఆకలిని నియంత్రించడానికి పనిచేస్తుంది.

ఆలు బుఖారా

ఆలు బుఖారా కంటే బరువు తగ్గడానికి మంచి మార్గం లేదు. ఆలు బుఖారా తీసుకోవడం రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఉదయం ఈ పండు తినడం రోజంతా తగినంత శక్తిని ఇస్తుంది.

చెర్రీ

చెర్రీస్ తినడం కూడా బరువు తగ్గడానికి గొప్ప మరియు ప్రభావవంతమైన మార్గం. ఖాళీ కడుపుతో చెర్రీస్ తినడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

స్ట్రాబెర్రీస్

రోజుకు ఐదు నుండి ఆరు స్ట్రాబెర్రీలను తినడం బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. స్ట్రాబెర్రీ తినడం వల్ల చర్మాన్ని అందంగా, యవ్వనంగా ఉంచడానికి కూడా మంచిది.

(గమనిక: ఏదైనా చికిత్సకు ముందు మీరు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.)

Also Read:

అపార్ట్‌మెంట్‌లో మంటలు.. తల్లడిల్లిన తల్లి గుండె.. బిడ్డల్ని కిటికీలోనుంచి

కీచక టీచర్.. విద్యార్థినులకు అశ్లీల చిత్రాలు చూపిస్తూ.. వికృత ఆనందం..