డిగ్రీ, పీజీ, బీటెక్ పరీక్షలను రద్దు చేయండిః పవన్ కళ్యాణ్

ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన విధంగానే డిగ్రీ, పీజీ, బీటెక్ తుది సంవత్సరం పరీక్షలను రద్దు చేసి ఉత్తీర్ణతను ప్రకటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటనను విడుదల చేశారు. ”కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఈ తరుణంలో విద్యార్థులకు ఏ విధమైన పరీక్షలు నిర్వహించకుండా ఉండటమే శ్రేయస్కరం. పదో తరగతి పరీక్షలు రద్దు చేసి […]

డిగ్రీ, పీజీ, బీటెక్ పరీక్షలను రద్దు చేయండిః పవన్ కళ్యాణ్
Follow us

|

Updated on: Jun 23, 2020 | 1:50 PM

ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన విధంగానే డిగ్రీ, పీజీ, బీటెక్ తుది సంవత్సరం పరీక్షలను రద్దు చేసి ఉత్తీర్ణతను ప్రకటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటనను విడుదల చేశారు. ”కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఈ తరుణంలో విద్యార్థులకు ఏ విధమైన పరీక్షలు నిర్వహించకుండా ఉండటమే శ్రేయస్కరం. పదో తరగతి పరీక్షలు రద్దు చేసి ఉత్తీర్ణత ప్రకటించిన విధంగానే డిగ్రీ తుది సంవత్సరం చదువుతున్నవారి విషయంలోనూ తగిన నిర్ణయం తీసుకోవాలి.

డిగ్రీతోపాటు ఎం.బి.ఎ, ఏజీ బీఎస్సీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐ.టీ.ఐ, లాంటి విద్యలు అభ్యసించి చివరి సెమిస్టర్ పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులకు ఇప్పుడు పరీక్షలు నిర్వహించే పరిస్థితి కనిపించడంలేదు. ఈ విద్యార్థులు తమ కాలేజీలు ఉన్న పట్టణాలు, నగరాలకు వెళ్ళడం, హాస్టల్స్‌లో ఉండి పరీక్షా కేంద్రాలకు వెళ్ళి రావడం వారి ఆరోగ్యాలకు శ్రేయస్కరం కాదు. మరో వైపు పైచదువులకు వెళ్ళేందుకు, క్యాంపస్ సెలెక్షన్స్‌లో జరిగిన ఉద్యోగాలకు ఎంపికై సర్టిఫికెట్స్ ఇచ్చేందుకు సమయం దగ్గరపడుతోందని… పరీక్షలు లేని కారణంతో పట్టాలు చేతికిరాక అర్హత కోల్పోతామనే ఆందోళన పెరుగుతోందని విద్యార్థులు జనసేన దృష్టికి తీసుకువచ్చారు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పరీక్షలు రద్దు చేసి ఉత్తీర్ణతను ప్రకటించాలి. ఇప్పటికే మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రద్దు చేసిన విషయాన్ని రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు పరిగణనలోకి తీసుకోవాలి. విద్యార్థుల ఆరోగ్యం, వారి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని విశ్వ విద్యాలయాలు తగిన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి.” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..