జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ విస్తరణ!

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పి.ఎ.సి.)లో మరో నలుగురు నాయకులకు అవకాశం కల్పిస్తూ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఛైర్మన్ గా ఉన్న ఈ కమిటీలో ఇప్పటి వరకూ 12 మంది సభ్యులు ఉన్నారు. కమిటీని విస్తరిస్తూ కొత్తవారికి స్థానం కల్పించడంతో ఆ సంఖ్య 16కి చేరింది. ఈ మేరకు బుధవారం కొత్త సభ్యులకు కమిటీలోకి ఆహ్వానం పలుకుతూ ట్విట్టర్ ద్వారా వివరాలు వెల్లడించారు. శ్రీ […]

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ విస్తరణ!
TV9 Telugu Digital Desk

| Edited By:

Nov 11, 2019 | 2:25 PM

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పి.ఎ.సి.)లో మరో నలుగురు నాయకులకు అవకాశం కల్పిస్తూ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఛైర్మన్ గా ఉన్న ఈ కమిటీలో ఇప్పటి వరకూ 12 మంది సభ్యులు ఉన్నారు. కమిటీని విస్తరిస్తూ కొత్తవారికి స్థానం కల్పించడంతో ఆ సంఖ్య 16కి చేరింది. ఈ మేరకు బుధవారం కొత్త సభ్యులకు కమిటీలోకి ఆహ్వానం పలుకుతూ ట్విట్టర్ ద్వారా వివరాలు వెల్లడించారు. శ్రీ పంతం నానాజీ (కాకినాడ), శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి (ధర్మవరం), శ్రీ బోనబోయిన శ్రీనివాస యాదవ్ (గుంటూరు), శ్రీ పితాని బాలకృష్ణ (ముమ్మిడివరం)లకు పి.ఎ.సి. సభ్యులుగా అవకాశం ఇచ్చారు. జనసేన అధికార ప్రతినిధులుగా ముగ్గురుకి అవకాశం ఇచ్చారు. శ్రీమతి సుజాత పండా (శ్రీకాకుళం), శ్రీ సుందరపు విజయకుమార్ (విశాఖపట్నం), శ్రీ పరుచూరి భాస్కరరావు (విశాఖపట్నం)లను అధికార ప్రతినిధులుగా నియమించారు.

భవన నిర్మాణ కార్మికుల కోసం విశాఖపట్నం నగరంలో చేపట్టిన లాంగ్ మార్చ్ ను విజయవంతం చేసిన పార్టీ నేతలు, జనసైనికులు, వాలంటీర్లుగా సేవలందించిన సుశిక్షితులైన వైజాగ్ జన సైనికులు, వీర మహిళలకు శ్రీ పవన్ కల్యాణ్ గారు ధన్యవాదాలు తెలియచేశారు. “ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో గణనీయమైన సేవలు అందించిన శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారికి హృదయపూర్వక అభినందనలు. ఆయనకు పార్టీపరంగా కీలక బాధ్యతలు ఇస్తామని పార్టీ బలోపేతానికి ఆయన సేవలు వినియోగించుకుంటామని తెలిపారు. శ్రీ సత్య బొలిశెట్టి గారికి నా కృతజ్ఞతలు. త్వరలో ఆయనకు పెద్ద బాధ్యతలు అప్పగిస్తాం. ఈ కార్యక్రమ నిర్వహణలో భాగం పంచుకున్న శ్రీ బాల సతీష్ గారికి ప్రత్యేక అభినందనలు. వేదిక దగ్గర విద్యుత్ షాక్ కి గురైన వారిపట్ల జాగ్రతలు ఆయన తీసుకున్నారు. అలాగే పోలీస్, జీవీఎంసీ, వుడా వారితో సమన్వయం చేసుకోవడంలో, తక్కువ సమయంలోనే వేదికను సిద్దం చేశారు. పార్టీ నాయకులు శ్రీ తోట చంద్రశేఖర్ రావు గారు, శ్రీ వి.వి.లక్ష్మీనారాయణ గారు, శ్రీ కొణిదెల నాగబాబు గారు బలంగా మద్దతు ఇచ్చారు. వారికి నా ధన్యవాదాలు.

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చిత్తశుద్ధి, సహకారం, సమన్వయం లేకుండా లాంగ్ మార్చ్ విజయవంతం సాధ్యమయ్యేది కాదు. డా.పాపిశెట్టి రామ మోహన రావు గారు (ఐ.ఎ.ఎస్. రిటైర్డ్) గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు మార్గదర్శకంగా నిలుస్తూ, ప్రోత్సహిస్తూ, మారుతున్న పరిస్థితుల్లోనూ నా పక్కన దృఢంగా నిలబడ్డారు” అని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణలో భాగమైన శ్రీ కోన తాతారావు, శ్రీ సుందరపు విజయకుమార్, శ్రీ పరుచూరి భాస్కర రావు, శ్రీ సందీప్ పంచకర్ల, శ్రీమతి పసుపులేటి ఉషాకిరణ్, శ్రీ సూర్య, శ్రీ సతీష్, శ్రీ గెడ్డం బుజ్జి, డా. బొడ్డేపల్లి రఘు, శ్రీ శివారెడ్డిలకు ధన్యవాదాలు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి తరలి వచ్చిన నాయకులు, శ్రేణులు, పార్టీలోని వివిధ విభాగాలకు అభినందనలు తెలిపారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu