ఏపీ రాజధాని అంశం తేలేది అప్పుడే!

ఏపీ రాజధాని అంశం తేలేదెప్పుడు? ఈ ప్రశ్న ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. యావత్ తెలుగు ప్రజల్లో నానుతోంది. డిసెంబర్ 27న జరిగే కేబినెట్ భేటీలోనే రాజధాని అంశాన్ని ముఖ్యమంత్రి జగన్ తేల్చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ, అందుకు భిన్నంగా రాజధాని అంశాన్ని తేల్చడంలో తొందరెందుకంటూ నిర్ణయాన్ని వాయిదా వేశారు ముఖ్యమంత్రి జగన్. మరి ఇంతకూ ఆయన రాజధాని అంశంపై తుది నిర్ణయం తీసుకునేదెప్పుడు? విశ్వసనీయ సమాచారాన్ని సేకరించింది టీవీ9 వెబ్‌సైట్. కేబినెట్ భేటీలో జరిగిన చర్చ, […]

ఏపీ రాజధాని అంశం తేలేది అప్పుడే!
Follow us

|

Updated on: Dec 28, 2019 | 1:20 PM

ఏపీ రాజధాని అంశం తేలేదెప్పుడు? ఈ ప్రశ్న ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. యావత్ తెలుగు ప్రజల్లో నానుతోంది. డిసెంబర్ 27న జరిగే కేబినెట్ భేటీలోనే రాజధాని అంశాన్ని ముఖ్యమంత్రి జగన్ తేల్చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ, అందుకు భిన్నంగా రాజధాని అంశాన్ని తేల్చడంలో తొందరెందుకంటూ నిర్ణయాన్ని వాయిదా వేశారు ముఖ్యమంత్రి జగన్. మరి ఇంతకూ ఆయన రాజధాని అంశంపై తుది నిర్ణయం తీసుకునేదెప్పుడు? విశ్వసనీయ సమాచారాన్ని సేకరించింది టీవీ9 వెబ్‌సైట్.

కేబినెట్ భేటీలో జరిగిన చర్చ, ఇన్ సైడ్ ఇన్ఫర్మేషన్, మంత్రుల వ్యాఖ్యలు… మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి కేబినెట్‌లో భేటీలో చేసిన కామెంట్లు.. ఇవన్నీ ఒకే అంశాన్ని సూచిస్తున్నాయి. రాజధాని అంశం తేలిపోయేదెప్పుడో క్లియర్‌గా చాటి చెబుతున్నాయి. కేబినెట్ సమావేశం వివరాలను వెల్లడించిన మంత్రి పేర్ని నాని జనవరి 3వ తేదీన బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ నివేదిక ప్రభుత్వానికి అందచేస్తుందని చెప్పారు. అదే సమయంలో జిఎన్ రావు, బోస్టన్ నివేదికలను పరిశీలించేందుకు హై పవర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా నాని వెల్లడించారు.

సో.. జనవరి 3న బోస్టన్ నివేదిక వచ్చే నాటికి ఏపీలో హై పవర్ కమిటీ ఏర్పాటవుతుంది. అధ్యయనానికి కనీసం 10 రోజులు పట్టే ఛాన్స్ వుంది. ఈలోగా సంక్రాంతి ఫెస్టివల్ వచ్చేస్తుంది. పండగ వాతావరణం ముగిసే నాటికి అంటే సుమారుగా 17 లేదా 18వ తేదీనాటికి హైపవర్ కమిటీ ఓ కంక్లూజన్‌కి వచ్చి, ముఖ్యమంత్రికి నివేదిస్తుంది. హైపవర్ కమిటీ సిఫారసులను పరిశీలించి సుమారు 20-22 తేదీల నాటికి రాజధాని విషయంలో సీఎం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం వుంది. ఆ తర్వాత రిపబ్లిక్ డే ముగిసిన తర్వాత కాస్త అటూ ఇటూగా… రాజధాని నిర్ణయాన్ని ముందుగా అందరికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వున్నారు.

ఇందుకోసం ముఖ్యమంత్రి ముందు రెండు మార్గాలున్నాయి. ఒకటి శాసనసభ ప్రత్యేక సమావేశాలను ఒకటి, రెండ్రోజులు నిర్వహించడం ద్వారా ప్రభుత్వ నిర్ణయానికి సభ ఆమోదం తీసుకుని ముందుకు వెళ్ళడం. అయితే.. ఇక్కడ ముఖ్యమంత్రి ముందు ఓ సవాల్ వచ్చి పడే ఛాన్స్ వుంది. శాసనసభలో బంపర్ మెజారిటీ వున్న జగన్ ప్రభుత్వం రాజధాని విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా సభ ఆమోదం ఈజీగా పొందుతుంది. కానీ, శాసనమండలిలో ఆమోదం తీసుకోవడం జగన్ ప్రభుత్వానికి కష్టమే. ఎందుకంటే ఏపీ శాసనమండలిలో వైసీపీ బలం కేవలం తొమ్మిదే. అదే సమయంలో రాజధాని మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీకి శాసనమండలిలో 30 సభ్యుల బలం వుంది. సో.. రాజధాని మార్పు విషయంలో మండలిలో ప్రభుత్వం ఇబ్బందికి గురయ్యే అవకాశాలే ఎక్కువ. అందువల్ల ప్రత్యేక సమావేశాలకు ముఖ్యమంత్రి మొగ్గు చూపకపోవచ్చనే భావించాలి.

ఇక ముఖ్యమంత్రి ముందున్న మరో మార్గం ముందుగా మంత్రివర్గంలో హైపవర్ కమిటీ సూచనపై చర్చించి, తీర్మానం చేయడం.. దానికి ముందుగానీ.. కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్న తర్వాతగానీ అఖిలపక్ష సమావేశం నిర్వహించి రాజకీయ పార్టీలకు ముందుగా వివరించి, ఆ తర్వాత ఫైనల్ డెసిషన్ పబ్లిక్‌కు వెల్లడించడం. అఖిలపక్ష భేటీలో అన్ని పార్టీలు వ్యతిరేకించినా ప్రభుత్వం తమ నిర్ణయంతో ముందుకు వెళ్ళే ఛాన్స్ కూడా వుంది.

రెండో మార్గాన్నే ముఖ్యమంత్రి ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా వున్న నేపథ్యంలో రాజధానిపై నిర్ణయం జనవరి నెలాఖరుకు ఖచ్చితంగా వస్తుందని పరిశీలకులు అంఛనా వేస్తున్నారు. సంక్రాంతి తర్వాత ఆగమేఘాల మీద నిర్ణయం తీసుకునే బదులుగా రిపబ్లిక్ డే తర్వాతనే తగిన నిర్ణయం వెల్లడించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.