జగన్ మరో సంచలనం.. ఇక నుంచి ప్రజాసేవలో మంత్రులు కూడా..

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజాసేవ నిమిత్తం మంత్రులు సచివాలయంలో అందుబాటులో ఉండాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది...

  • Updated On - 3:42 pm, Fri, 28 February 20
జగన్ మరో సంచలనం.. ఇక నుంచి ప్రజాసేవలో మంత్రులు కూడా..

Jagan Government Orders: ఇటీవలే ‘అమ్మఒడి’, ‘జగనన్న విద్యా దీవెన’, ‘జగనన్న వసతి దీవెన’ వంటి పలు పథకాలను ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజాసేవ నిమిత్తం మంత్రులు సచివాలయంలో అందుబాటులో ఉండాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలకు, అర్జీదారుల కొరకు ప్రతీ బుధవారం సెక్రటేరియేట్‌లో వారంతా హాజరు కావాలని జగన్ ఆదేశించారు. దీనితో ఆయా సంబంధిత శాఖల్లో ఉన్న సమస్యలకు సత్వరమే పరిష్కారం దొరుకుతుందని ఆయన భావిస్తున్నారు.

గతంలో జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ప్రతి మంగళవారం, బుధవారం విధిగా సచివాలయానికి రావాలని సీఎం ఆదేశించిన సంగతి విదితమే. అయితే నియోజకవర్గ పనులు, సంక్షేమ పథకాల, దూరభారం దృష్ట్యా మంత్రులకు వెసులుబాటు కల్పిస్తూ వారంలో ఒక్క రోజు ఉంటే సరిపోతుందని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

For More News:

వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. బిల్లు చెల్లించకపోతే ఆటోమేటిక్‌గా పవర్ కట్..!

విషాదం: ఫ్లెక్సీ కడుతూ వైఎస్ జగన్ స్నేహితుడు మృతి..!

ఇదెక్కడి విచిత్రమో! అమలాపురం స్కూల్‌లో స్టూడెంట్స్ అందరూ కవలలే..

కిక్కిచ్చే వార్త.. లేడీస్ కోసం ప్రత్యేక మద్యం షాపులు..!

బుమ్రాపై వేటు.. ఆ ఇద్దరికీ ఛాన్సు.. కోహ్లీ ఆలోచన సరైనదేనా.?