చిత్రదుర్గలోని జడ గణేశుడు… ప్రత్యేకతలు ఇవే!

హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి. అన్నికార్యములకూ, పూజలకూ ప్రధమముగా పూజింపవలసినవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు వినాయకుడు. ఈయనను గణనాయకుడు, గణపతి, గణేశుడు మరియు అన్ని అడ్డంకులు తొలగించు వాడు విఘ్నేశ్వరుడు అంటూ అనేక రకాలుగా కొలుస్తారు. అయితే కర్ణాటకలో హోళల్కేరెలో ఉన్న గణేశుడిని జడ గణేష మరియు వర్ష గణపతి అని కూడా పిలుస్తారు. ఈ గణేషుడి మహిమ ఏంటి..ఈ దేవాలయం ఎక్కడ ఉంది. వివరాల్లోకెళితే… కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హోళల్కేరెలో […]

చిత్రదుర్గలోని జడ గణేశుడు... ప్రత్యేకతలు ఇవే!
TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 11, 2019 | 11:51 AM

హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి. అన్నికార్యములకూ, పూజలకూ ప్రధమముగా పూజింపవలసినవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు వినాయకుడు. ఈయనను గణనాయకుడు, గణపతి, గణేశుడు మరియు అన్ని అడ్డంకులు తొలగించు వాడు విఘ్నేశ్వరుడు అంటూ అనేక రకాలుగా కొలుస్తారు. అయితే కర్ణాటకలో హోళల్కేరెలో ఉన్న గణేశుడిని జడ గణేష మరియు వర్ష గణపతి అని కూడా పిలుస్తారు. ఈ గణేషుడి మహిమ ఏంటి..ఈ దేవాలయం ఎక్కడ ఉంది. వివరాల్లోకెళితే…

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హోళల్కేరెలో ఈ జడ గణేశుడి దేవాలయం ఉంది. చిత్రదుర్గకు సమీపంలోనే ఈ జడ గణేశుడి దేవాలయం ఉంది. సుమారు 20 అడుగుల ఎత్తులో ఈ గణేశుడి విగ్రహాన్ని 1475వ సంవత్సరంలో నిర్మించారు. వందలాది సంవత్సరాలు ఈ దేవాలయం ఎలాంటి నిర్మాణం కాకపోవడంతో గణేశుడి విగ్రహం బహిరంగ ప్రదేశంలో ఉండిపోయింది. గుడి లేకుండా ఉన్న ఈ దేవాలయాన్ని బయలు గణేశ దేవాలయం అని పిలుస్తుంటారు.

జడ గణేశుడు

చిత్రదుర్గ జిల్లాలోని ప్రసద్ది చెందిన బయలు గణపతికి వెంట్రుకలు ఉండటంతో జడ గణేశుడు అని కూడా పిలుస్తుంటారు. ఈ దేవాలయం ఉన్న ఊరిలో నీటి సమస్యతో కరువు కాలం వస్తే వినాయకుడికి నీటితో అభిషేకం చేస్తే వర్షాలు కురుస్తాయని చరిత్ర చెబుతోంది. అందు వలన ఈ వినాయకుడిని వాన గణపతి అని కూడా పిలుస్తుంటారు.

నమ్మలేని నిజాలు

మనోకార్యసిద్ధి:

ఈ బయలు గణేశుడిని భక్తి శ్రద్దలతో పూజించి ప్రార్థనలు చేసిన వారి మనోసిద్ధి ఫలిస్తుందనే నమ్మకం ఉంది.

హోరకెరె దేవుడు (కోరికల దేవుడు):

వైఫ్ణవులకు చెందిన ప్రసిద్ది చెందిన లక్ష్మిరంగనాథ స్వామి ఆలయం ఇక్కడ ఉంది. ఈ ఆలయాన్ని విజయనగర కాలంలో నిర్మించారు. 1348వ సంవత్సరంలో డమ్మి వీరప్ప నాయక ఈ దేవాలయం గర్బగుడిని నిర్మించారు.

ఒంటి చెట్టు మఠం

ఈ ప్రాంతంలో ఒట్లి చెట్టు మఠం ఉంది. ఇది ప్రసిద్ది చెందిన మురుగ మఠం. ఈ మఠంకు 300 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ మఠం మంటపం ఒకే ఒక్క చెట్టు మీద ఉండటంతో ఒంటి మర మఠం ( ఒంటి చెట్టు మఠం) అనే పేరు ఉంది. ఈ మఠం ముందు ప్రత్యేకమైన కోనేరు ఉంది.

ఎలా వెళ్ళాలి

రోడ్డు మార్గం:

కర్ణాటకలోని చిత్రదుర్గలోని హోళెల్కేరేని బయలు గణేశుడి ఆలయం దగ్గరకు చేరుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఈ దేవాలయాని చేరుకోవడానికి కేఎస్ఆర్ టీసీకి చెందిన సాధారణ బస్సులు ఉన్నాయి.

రైలు మార్గం:

దేశంలోని వివిద రాష్ట్రాలు, నగరాలు, పట్టణాల నుంచి సులభంగా రైలు మార్గంలో హోళెల్కేరే చేరుకోవచ్చు. హోళెల్కేరే రైల్వేస్టేషన్, చిక్కజజూరు జంక్షన్ రైల్వేస్టేషన్, తుప్పదహళ్ళి సమీపంలోని రైల్వేస్టేషన్లు, హుళియూరు రైల్వేస్టేషన్ లు ఈ దేవాలయానికి సమీపంలో ఉన్నాయి.

విమాన మార్గం:

ఈ దేవాలయం సమీపంలో విమానాశ్రయం లేదు. చిత్రదుర్గ జిల్లాకు దగ్గరలో మంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయం, హుబ్బళి విమానాశ్రయాలు ఉన్నాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu