యూనివర్స్ బాస్ ఇక్కడ.. హార్ట్ ఎటాక్ తెప్పించగలను..!

యూనివర్స్ బాస్ ఇక్కడ.. మీకు హార్ట్ ఎటాక్ తెప్పిస్తా.. ఈ టైటిల్‌కు కరెక్ట్‌గా జస్టిఫికేషన్ ఇచ్చాడు వెస్టిండీస్ డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్. నిన్నటి

యూనివర్స్ బాస్ ఇక్కడ.. హార్ట్ ఎటాక్ తెప్పించగలను..!
Follow us

|

Updated on: Oct 16, 2020 | 6:25 PM

యూనివర్స్ బాస్ ఇక్కడ.. మీకు హార్ట్ ఎటాక్ తెప్పిస్తా.. ఈ టైటిల్‌కు కరెక్ట్‌గా జస్టిఫికేషన్ ఇచ్చాడు వెస్టిండీస్ డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్. నిన్నటి మ్యాచ్‌ను చివరి బంతి వరకు తీసుకెళ్ళి నిజంగానే ప్రేక్షకులకు హార్ట్ ఎటాక్ తెప్పించాడు ఈ యూనివర్స్ బాస్. గేల్, రాహుల్ ఇద్దరూ క్రీజులో ఉన్నారు. పంజాబ్‌కు చివరి రెండు ఓవర్లలో ఏడు పరుగులు కావాల్సి ఉంది. 18 ఓవర్‌లోనే మ్యాచ్ ముగుస్తుందని అందరూ అనుకున్నారు. అయితే యూనివర్స్ బాస్ చివరి దాకా తీసుకెళ్లాడు.

ఏది ఏమైనా యూనివర్స్ బాస్ రాకతో పంజాబ్ మురిసింది. లీగ్‌లో రెండో విజయాన్ని అందుకుంది. ఇక మ్యాచ్ అనంతరం ”చాలా రోజుల తర్వాత బ్యాటింగ్ చేయడంతో ఒత్తిడి అనిపించిందా అని కామెంటేటర్స్ క్రిస్ గేల్‌ను అడగ్గా.. ” ఇట్స్ యూనివర్స్ బాస్ బ్యాటింగ్.. నేను ఎందుకు ఒత్తిడికి లోనవుతా.. మీకే హార్ట్ ఎటాక్ తెప్పించగలను” అని పేర్కొన్నాడు. (Universe Boss Chris Gayle Is Back)

”కమాన్ మ్యాన్.. ఇట్స్ యూనివర్స్ బాస్ బ్యాటింగ్. నేను ఎందుకు ఒత్తిడికి లోనవుతా. మీకే హార్ట్ ఎటాక్ తెప్పించగలను. చాలా బాగా ఆడాను. ఈ ప్రదర్శనతో ఐపీఎల్ 2021కు కూడా సిద్దంగా ఉండాలని అనుకుంటున్నా. ఈ పిచ్‌పై మొదట బ్యాటింగ్ చేసే జట్టుకే ఇబ్బంది. జట్టుకు నా నుంచి కావాల్సింది నేను పూర్తి చేశాను. మా ఓపెనర్లు రాహుల్, మయాంక్ అగర్వాల్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. అందుకే వాళ్లను అలాగే ఆడించాలని అనుకున్నాం. ఈ విజయం జట్టుకు జట్టుకు ఎంతో ముఖ్యమైనది. ఫిట్‌గా ఉండటం ముఖ్యం అని నేను అనుకున్నాను, రిజర్వ్ బెంచ్‌కి పరిమితం కావడం నాకు ఇష్టం ఉండదు” అని గేల్ పేర్కొన్నాడు.