కరోనా మరణాల్లో చైనాను దాటోసిన ఇటలీ..పరిస్థితి అల్లకల్లోలం..

కరోనా విజృంభన కొనసాగుతూనే ఉంది. ప్రపంచ దేశాలు ఈ మాయదారి వైరస్ భయంతో వణికిపోతున్నాయి. వుహాన్ పురుడుపోసుకున్న ఈ రక్కసి వైరస్..మృత్యునాదం చేస్తూ తన పరిధి పెంచుకుంటూ పోతుంది.  మదర్‌ల్యాండ్ చైనాలో కరోనా వ్యాప్తి తగ్గినా, మిగిలిన దేశాల్లో మాత్రం అదుపులోకి రావడం లేదు. ఇటలీలో అయితే రోజుకు వందల సంఖ్యలో వ్యక్తులు ప్రాణాలు కొల్పోతున్నారు. ఇప్పటివరకు కరోనా మరణాలు చైనాలో అత్యధికంగా నమోదవ్వగా..తాజాగా ఇటలీ చైనాను బీట్ చేసింది.  గడిచిన 24 గంటల్లోనే ఇటలీలో 500 […]

కరోనా మరణాల్లో చైనాను దాటోసిన ఇటలీ..పరిస్థితి అల్లకల్లోలం..
Follow us

|

Updated on: Mar 20, 2020 | 10:03 PM

కరోనా విజృంభన కొనసాగుతూనే ఉంది. ప్రపంచ దేశాలు ఈ మాయదారి వైరస్ భయంతో వణికిపోతున్నాయి. వుహాన్ పురుడుపోసుకున్న ఈ రక్కసి వైరస్..మృత్యునాదం చేస్తూ తన పరిధి పెంచుకుంటూ పోతుంది.  మదర్‌ల్యాండ్ చైనాలో కరోనా వ్యాప్తి తగ్గినా, మిగిలిన దేశాల్లో మాత్రం అదుపులోకి రావడం లేదు. ఇటలీలో అయితే రోజుకు వందల సంఖ్యలో వ్యక్తులు ప్రాణాలు కొల్పోతున్నారు. ఇప్పటివరకు కరోనా మరణాలు చైనాలో అత్యధికంగా నమోదవ్వగా..తాజాగా ఇటలీ చైనాను బీట్ చేసింది.  గడిచిన 24 గంటల్లోనే ఇటలీలో 500 మంది ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు చైనాలో కరోనా వైరస్ కారణంగా 3,248 మంది ప్రాణాలు కోల్పోగా, ఇటలీ ఈ ఫిగర్‌ను క్రాస్ చేసింది.
ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం.. ఇటలీలో కరోనా మృతుల సంఖ్య 3,405కు చేరింది. బాధితుల సంఖ్య 41వేలు దాటింది. కరోనా విషయంలో మొదట ఇటలీ నిర్లక్ష దోరణి అవలంభించడంతోనే మరణాల సంఖ్య అధికమైందనే విమర్శలున్నాయి. చర్యలు తీసుకోవడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని..ఇటలీలో సేవలంధవిస్తోన్న చైనా వైద్యులు అభిప్రాయపడుతున్నారు.