ఐటీ కంపెనీల్లో భారీగా ఉద్యోగాల కోత!

ఆర్థిక మందగమనంతో ఐటీ కంపెనీల్లో భారీగా ఉద్యోగాల కోత నెలకొంది. తగ్గుతున్న కాంట్రాక్టులు, పెరుగుతున్న వ్యయం కారణంగానే కోత విధిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో మరికొన్ని కంపెనీలు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆటోమేషన్‌ రాక కారణంగానూ.. ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించే ధోరణి పెరిగిందని హెచ్‌ఆర్‌ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి లేఆఫ్స్ ఇటీవల కాలంలో చోటు చేసుకోలేదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అంతకుముందు పర్‌‌‌‌ఫార్మెన్స్ ఆధారంగా ఉద్యోగులను తీసేవారని.. కానీ, ఇప్పుడు తీసేస్తోన్న […]

ఐటీ కంపెనీల్లో భారీగా ఉద్యోగాల కోత!
Follow us

| Edited By:

Updated on: Nov 18, 2019 | 6:46 PM

ఆర్థిక మందగమనంతో ఐటీ కంపెనీల్లో భారీగా ఉద్యోగాల కోత నెలకొంది. తగ్గుతున్న కాంట్రాక్టులు, పెరుగుతున్న వ్యయం కారణంగానే కోత విధిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో మరికొన్ని కంపెనీలు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆటోమేషన్‌ రాక కారణంగానూ.. ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించే ధోరణి పెరిగిందని హెచ్‌ఆర్‌ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి లేఆఫ్స్ ఇటీవల కాలంలో చోటు చేసుకోలేదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అంతకుముందు పర్‌‌‌‌ఫార్మెన్స్ ఆధారంగా ఉద్యోగులను తీసేవారని.. కానీ, ఇప్పుడు తీసేస్తోన్న ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఈ ఏడాది 30,000 నుంచి 40,000 మంది మధ్యశ్రేణి ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని ఐటీ పరిశ్రమ ప్రముఖులు, ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌ఓ టీవీ మోహన్‌దాస్‌ పాయ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలో మార్పుల పరంగా ప్రతి ఐదేళ్లలో ఒకసారి ఇలాంటివి సాధారణమేనని చెప్పుకొచ్చారు. స్లోడౌన్‌ వంటి ప్రతికూల పరిస్ధితుల్లో కంపెనీలు సహజంగానే అధిక వేతనాలు అందుకునే ఉద్యోగులపైనే తొలుత దృష్టిసారిస్తాయని చెప్పుకొచ్చారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి అత్యంత సహజంగా ఇలా జరుగుతూనే ఉంటుందని అన్నారు. మెరుగైన సామర్థ్యం కనబరిచేవరకే ఎవరైనా అధిక వేతనం పొందేందుకు అర్హులని, తీసుకునే వేతనానికి సమాన స్ధాయిలో కంపెనీకి విలువ జోడించాలని పాయ్‌ స్పష్టం చేశారు.