కార్పోరేట్ కాలేజీలకు ఐటీ షాక్..

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఐటీ దాడులు సంచలనంగా మారాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని శ్రీ చైతన్య కాలేజీ లో ఐటీ అధికారులు ఏక కాలంలో సోదాలు చేపట్టారు. హైదరాబాద్, విజయవాడలో ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రికార్డు మొత్తాన్ని ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీ చైతన్య కాలేజీ డైరెక్టర్ లతోపాటు మేనేజర్ లైన్ లో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మాదాపూర్ లోని శ్రీ చైతన్య కార్పొరేట్ కాలేజీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటికే […]

కార్పోరేట్ కాలేజీలకు ఐటీ షాక్..
Follow us

|

Updated on: Mar 05, 2020 | 5:09 PM

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఐటీ దాడులు సంచలనంగా మారాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని శ్రీ చైతన్య కాలేజీ లో ఐటీ అధికారులు ఏక కాలంలో సోదాలు చేపట్టారు. హైదరాబాద్, విజయవాడలో ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రికార్డు మొత్తాన్ని ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీ చైతన్య కాలేజీ డైరెక్టర్ లతోపాటు మేనేజర్ లైన్ లో సోదాలు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్ మాదాపూర్ లోని శ్రీ చైతన్య కార్పొరేట్ కాలేజీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటికే రికార్డు మొత్తాన్ని ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీ చైతన్య కాలేజీ డైరెక్టర్ లతోపాటు మేనేజర్ లైన్ లో సోదాలు కొనసాగుతున్నాయి. విజయవాడ కార్పోరేట్ కళాశాలల సెంట్రల్ ఆఫీస్ లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. విజయవాడలోని శ్రీచైతన్య ,నారాయణ సెంట్రల్ ఆఫీస్ లపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారు జామున 5 గంటల సమయంలో పెద్ద సంఖ్యలో అధికారులు పలు రికార్డలు స్వాధీనం చేసుకుని విస్తృత తనిఖీలు చేపడుతున్నట్లు సమాచారం. విద్యార్థుల ఫీజుల ద్వారా వచ్చిన కోట్లాది రూపాయలకు సంబంధించిన న్యాయబద్ధంగా కట్టాల్సిన పన్ను ఎగవేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

మొత్తం 8 టీంలు తనిఖీల్గొ పాల్గొంటున్నాయి. గత కొంతకాలంగా..నారాయణ, శ్రీ చైతన్య కాలేజీల్లో జరుగుతున్న అడ్మిషన్లు, వ్యాపార లావాదేవీల్లో వెల్లడించిన వివరాలు వేరేగా ఉన్నాయని ఆరోపణలున్నాయి. దీంతో పూర్తి సమాచారం తీసుకున్న తర్వాతే..ఐటీ అధికారులు రంగంలోకి దిగి సోదాలు నిర్వహించారు. కంప్యూటర్స్ హార్డ్ డిస్క్, ఇతర రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో తెల్లవారుజామున ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించి..రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ల నివాసాలు, హైదరాబాద్ లో ఉన్న ప్రధాన కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. కళాశాలల యజమాన్యాలు వెల్లడించిన వివరాలు, సోదాల్లో లభించిన వివరాలను బేరీజు వేసుకుంటున్నట్లు సమాచారం.