మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. అంతరిక్షంలోకి వాహక నౌక.. ఈనెల 17న ముహూర్తం ఖరారు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది. పీఎస్‌ఎల్‌వీ - సీ50 ని అంతరిక్షంలోకి పంపేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.

  • Balaraju Goud
  • Publish Date - 5:48 am, Sun, 13 December 20
మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. అంతరిక్షంలోకి వాహక నౌక.. ఈనెల 17న ముహూర్తం ఖరారు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది. పీఎస్‌ఎల్‌వీ – సీ50 ని అంతరిక్షంలోకి పంపేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఈనెల 17 ను మహూర్తంగా నిర్ణయించింది. అత్యాధునిక సాంకేతిక సమాచారాన్ని సత్వరం అందుబాటులోకి తెచ్చేందకు ఇస్రో సాగించే నిరంతర ప్రక్రియ మరింత వేగవంతమైంది. షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈనెల 17న సాయంత్రం 3:41 గంటలకు పీఎస్‌ఎల్‌వీ – సీ50 ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించేందుకు ఇస్రో రెఢీ అవుతోంది. 1,410 కేజీల బరువు కలిగిన సీఎంఎస్‌–01 (జీశాట్‌–12ఆర్‌) అనే సరికొత్త కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు ఇస్రో అధికారులు. వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌లో (వ్యాబ్‌)లో రాకెట్‌ అనుసంధానం చేసిన దృశ్యాలను ఇస్రో శుక్రవారం విడుదల చేసింది.

క‌మ్యూనికేష‌న్ శాటిలైట్ సీఎంఎస్-01ను పీఎస్ఎల్వీ సీ-50 ద్వారా డిసెంబ‌ర్ 17వ తేదీన మ‌ధ్యాహ్నం 3:41 గంట‌ల‌కు నింగిలోకి పంప‌నున్నారు. ఈ ప్రయోగం శ్రీహ‌రికోట‌లోని స‌తీష్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్ రెండో ప్రయోగ‌ వేదిక‌ నుంచి ప్రయోగించ‌నున్నట్లు ఇండియ‌న్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేష‌న్‌(ఇస్రో) ప్రక‌టించింది. భార‌త‌దేశ‌పు 42వ క‌మ్యూనికేష‌న్ ఉప్రగ‌హం.. సీఎంఎస్-01 ఫ్రీక్వెన్సీ స్పెక్ర్టంలో విస్తరించిన సీ బ్యాండ్ సేవ‌ల‌ను అందించేందుకు నిర్దేశించారు. దీని ప‌రిమితి భార‌త్‌తో పాటు అండ‌మాన్ నికోబార్ దీవులు, లక్ష్యదీప్‌ల‌కు విస్తరిస్తుంది. పీఎస్ఎల్వీ సీ-50 ఎక్స్ఎల్ సిరీస్‌‌లో ఇది 22వది అని ఇస్రో తెలిపింది. అంతేకాకుండా షార్ నుంచి ఇది 77వ మిష‌న్ అని వెల్లడించింది.