మూన్‌పై సందడి చేసిన ‘ఇస్మార్ట్ సత్తి’

టీవీ9 స్టార్ట్ చేసిన సరికొత్త సెటైరికల్ ప్రొగ్రామ్ ‘ఇస్మార్ట్ న్యూస్’. అరగంట సేపు వివిధ రకాల వార్తల్ని వ్యంగ్యంగా ప్రజెంట్ చేసే కార్యక్రమం ఇస్మార్ట్ సత్తి సందడి చేస్తున్నాడు. తెలంగాణ ప్రాంత యాస, భాషలో పడికట్టు మాటలు, నవ్వు తెప్పించే సామెతలతో ఈ కార్యక్రమానికి నవ్వుల నవాబు సత్తి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నాడు. తాజా ఎపిసోడ్‌లో సత్తి ఏకంగా మూన్‌పై సందడి చేశాడు. ఇస్రో చేపట్టిన చంద్రయాన్ ప్రయోగం కోసం ప్రపంచం యావత్తూ ఆసక్తిగా ఎదురు చూసింది. […]

మూన్‌పై సందడి చేసిన 'ఇస్మార్ట్ సత్తి'
Ismart News Tv9
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 10, 2019 | 7:16 AM

టీవీ9 స్టార్ట్ చేసిన సరికొత్త సెటైరికల్ ప్రొగ్రామ్ ‘ఇస్మార్ట్ న్యూస్’. అరగంట సేపు వివిధ రకాల వార్తల్ని వ్యంగ్యంగా ప్రజెంట్ చేసే కార్యక్రమం ఇస్మార్ట్ సత్తి సందడి చేస్తున్నాడు. తెలంగాణ ప్రాంత యాస, భాషలో పడికట్టు మాటలు, నవ్వు తెప్పించే సామెతలతో ఈ కార్యక్రమానికి నవ్వుల నవాబు సత్తి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నాడు.

తాజా ఎపిసోడ్‌లో సత్తి ఏకంగా మూన్‌పై సందడి చేశాడు. ఇస్రో చేపట్టిన చంద్రయాన్ ప్రయోగం కోసం ప్రపంచం యావత్తూ ఆసక్తిగా ఎదురు చూసింది. కానీ విక్రమ్ ల్యాండర్ చంద్రుడి మీద సరిగా ల్యాండ్ కాకపోవడం, సంబంధాలను కోల్పోవడం భారతీయుల్ని బాధించింది. ఈ విషయంపై కామెడీ వేలో జనాల్ని ఆలోచింపజేశాడు ఇస్మార్ట్ సత్తి. కొందరు తెలివిలేని జనాలు ఇస్రోపై  చేస్తున్న అర్థంలేని విమర్శలను తన కామెడీ సెటైర్లతో కడిగిపారేశాడు. ఆద్యంతం అమాయకత్వంతో మాట్లాడుతూ నవ్వులు  పంచడంతో పాటు ఆలోచింపజేసిన ఈ ఎపిసోడ్ మీ కోసం.