ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ : సెకండాఫ్‌లో రాణించిన నార్త్‌ఈస్ట్ యునైటెడ్ ఆటగాళ్లు, డ్రాగా ముగిసిన గేమ్

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌  ఏడో సీజన్‌లో భాగంగా  నార్త్ ఈస్ట్ యునైటెడ్,కేరళబ్లాస్టర్స్ మధ్య ఇంట్రస్టింగ్‌గా జరిగిన మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది.

  • Ram Naramaneni
  • Publish Date - 11:56 am, Fri, 27 November 20
 ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ : సెకండాఫ్‌లో రాణించిన నార్త్‌ఈస్ట్ యునైటెడ్ ఆటగాళ్లు, డ్రాగా ముగిసిన గేమ్

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌  ఏడో సీజన్‌లో భాగంగా నార్త్ ఈస్ట్ యునైటెడ్, కేరళబ్లాస్టర్స్ మధ్య ఇంట్రస్టింగ్‌గా జరిగిన మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. జీఎమ్‌సీ మైదానంలో గురువారం కేరళబ్లాస్టర్‌తో జరిగిన మ్యాచ్‌ను 2-2తో డ్రాగా ముగియడంతోొ… నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ పరాజయం నుంచి గట్టెక్కింది. కేరళ బ్లాస్టర్ తరఫున సెర్జియో కిడోంచా(5వ నిమిషం), గ్యారీ హూపర్ (45+1 నిమిషం) గోల్స్ సాధించగా.. నార్త్ ఈస్ట్ యునైటెడ్‌లో క్వెసి అప్పియా(51వ నిమిషం), ఇడ్రిస్సా సిల్లా(90వ నిమిషం) గోల్స్ చేశారు. మొదట్నుంచి ఇంట్రస్టింగ్‌గా సాగిన ఈ మ్యాచ్ ఫుట్ బాల్ ఫ్యాన్స్‌ను అలరించింది.

ఇక మ్యాచ్ ప్రారంభానికి ముందు హార్ట్ అటాక్‌తో మృతి చెందిన ఫుట్ బాల్ దిగ్గజం డీగో మారడోనాకు ఇరు జట్ల ప్లేయర్స్ ఘననివాళి ప్రకటించారు. అనంతరం కాసేపు సంతాపంగా మౌనం పాటించారు. అనంతరం ఇరు జట్ల ప్లేయర్స్ బ్లాక్ రిబ్బన్స్‌తో బరిలోకి దిగారు. ఆపై ఇరు జట్లు విజయం కోసం టఫ్ ఫైట్ చేశాయి. ఫస్ట్ హాఫ్‌లో  కేరళబ్లాస్టర్స్ ఆటగాళ్లు రాణించగా…సెకండాఫ్ లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఆటగాళ్లు రాణించి  మ్యాచ్‌ను డ్రాగా ముగించారు.

Also Read :

నేడు ఏపీ కేబినెట్ భేటీ, సభలో పెట్టే బిల్లులపై చర్చ, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై కీలక నిర్ణయం

ఏపీలో 53 మంది మహిళా జీవిత ఖైదీల విడుదలకు ఉత్తర్వులు, అలా చేస్తే ఆర్డర్స్ రద్దు

కేంద్రం కీలక నిర్ణయం, స్థానిక భాషల్లో ఇంజనీరింగ్‌ కోర్సులు, వచ్చే అకడమిక్ ఇయర్ నుంచే