ISL 2020-21: విజయాల పరంపరను కొనసాగిస్తోన్నముంబై సిటీ .. హైదరాబాద్‌కు ఓటమి..పాయింట్ల పట్టికలో స్థానాలు ఇలా

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ 2020-21 సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది.  ముంబై సిటీ విజయ పరంపర కొనసాగుతోంది. మూకుమ్మడి ప్రదర్శనతో మరో విజయాన్ని ఒడిసిపట్టి..

ISL 2020-21: విజయాల పరంపరను కొనసాగిస్తోన్నముంబై సిటీ .. హైదరాబాద్‌కు ఓటమి..పాయింట్ల పట్టికలో స్థానాలు ఇలా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 21, 2020 | 2:35 PM

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ 2020-21 సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది.  ముంబై సిటీ విజయ పరంపర కొనసాగుతోంది. మూకుమ్మడి ప్రదర్శనతో మరో విజయాన్ని ఒడిసిపట్టి.. పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో ముందుకు వెళ్తుంది. ఆదివారం హైదరాబాద్‌ ఎఫ్‌సీ‌ జట్టుతో జరిగిన మ్యాచులో 2-0తో ముంబై గెలుపొందింది. ముంబై తరపున విఘ్నేష్ దక్షిమమూర్తి (38), ఆడమ్ లే ఫోండ్రేలు (59) చెరో గోల్ చేశారు. పలుసార్లు మంచి అవకాశాలు వచ్చినా వినియోగించుకోలేకపోయిన హైదరాబాద్‌ పరాజయం పాలయ్యింది. కాగా 16 పాయింట్లతో ముంబై టాప్ ప్లేస్‌లో ఉండగా.. 9 పాయింట్లతో హైదరాబాద్ ఆరవ స్థానంలో ఉంది.

మరోవైపు కేరళ బ్లాస్టర్స్, ఈస్ట్ బెంగాల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. ఈస్ట్ బెంగాల్ తరఫున బకరీ కోన్, కేరళ బ్లాస్టర్స్ తరఫున జేక్సన్ గోల్స్ చేశారు. ఫస్టాఫ్‌లో ఈస్ట్ బెంగాల్ ఆధిపత్యం చెలాయించగా.. కేరళ బ్లాస్టర్స్ సెకండాఫ్‌లో సత్తా చాటింది. చివరి నిమిషంలో జేక్సన్ పుజుకోవడంతో కేరళ డ్రాతో ముగించింది.

సోమవారం జరిగే మ్యాచులో ఏటికే మోహన్ బగాన్, బెంగళూరు ఎఫ్‌సీ‌ జట్లు మైదానంలో తలపడనున్నాయి.ఫటోర్డా స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ మొదలవనుంది.

Also Read :

కమ్మేసిన మంచు దుప్పటి.. తెలంగాణలోని ఆ రెండు జిల్లాలపై చలి పంజా…ఈ సీజన్‌లోనే అత్యల్పం

ఇంద్రపాలెం వద్ద విద్యుత్ తీగలు తగిలి కంటైనర్‌‌లో మంటలు.. 40 ద్విచక్రవాహనాలు అగ్నికి ఆహుతి