ISL 2020 21: డ్రాగా ముగిసిన ఈస్ట్ బెంగాల్, చెన్నాయిన్ మ్యాచ్..పందెం కోళ్లలా పోటి పడ్డ ఇరు జట్ల ఆటగాళ్లు

 ఇండియన్ సూపర్ లీగ్ 2020-21 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. నెగ్గేందుకు అన్ని చెట్లు తమ అస్త్ర శస్త్రాలను వినియోగిస్తున్నాయి. దీంతో చాలా మ్యాచ్‌లు డ్రాగా ముగుస్తున్నాయి.

ISL 2020 21: డ్రాగా ముగిసిన ఈస్ట్ బెంగాల్, చెన్నాయిన్ మ్యాచ్..పందెం కోళ్లలా పోటి పడ్డ ఇరు జట్ల ఆటగాళ్లు
Follow us

|

Updated on: Dec 27, 2020 | 9:12 PM

ఇండియన్ సూపర్ లీగ్ 2020-21 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. నెగ్గేందుకు అన్ని చెట్లు తమ అస్త్ర శస్త్రాలను వినియోగిస్తున్నాయి. దీంతో చాలా మ్యాచ్‌లు డ్రాగా ముగుస్తున్నాయి. తాజాగా మరో మ్యాచ్ ఫలితం తేలకుండానే ఎండ్ అయింది. రెండు రోజుల క్రిస్మస్ బ్రేక్ అనంతరం ఈస్ట్ బెంగాల్, చెన్నాయిన్ ఫుట్‌బాల్ క్లబ్ మధ్య శనివారం హోరాహోరి ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ 2-2తో డ్రా అయ్యింది. విజయాల బాటలో పయనించాలన్న ఈస్ట్ బెంగాల్ కల..కలలానే ముగిసింది.  మాట్టి స్టీన్‌మన్(59, 68వ నిమిషం) ఈస్ట్ బెంగాల్‌ తరుఫున రెండు గోల్స్ చేశాడు. లాల్‌నజులా(13వ నిమిషం), రహిమ్ అలీ(64వ నిమిషం) చెన్నాయిన్‌కు గోల్స్ అందించారు.

సంక్రాంతి పందెం కోళ్లలా పోటి పడ్డ ఈ మ్యాచ్‌లో.. 13వ నిమిషంలోనే చెన్నాయిన్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈస్ట్ బెంగాల్ గోల్ సాధించలేకపోవడంతో అదే స్కోర్ వద్ద ప్రథమ భాగం ముగిసింది. అయితే ద్వితీయ భాగంలో బెంగాల్ జోరు పెంచింది. 59వ నిమిషంలో గోల్ చేసిన స్టీన్‌మన్.. బెంగాల్‌ను తిరిగి ట్రాక్‌లో నిలబెట్టాడు. కానీ ఐదు నిమిషాలు తిరిగేసరికే చెన్నయన్ 2-1తో తిరిగి ఆధిక్యంలోకి దూసుకుపోయింది.  మూడు నిమిషాల తర్వాత స్టీన్ మన్ మరో గోల్ సాధించడంతో స్కోర్లు ఈక్వల్ అయ్యాయి. ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా రెండు టీమ్స్ గోల్ చేయలేకపోయాయి. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు నమోదు చేసిన చెన్నయన్‌కు ఇది మూడో డ్రా.. మరోపక్క ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో పరాజయం చెందిన బెంగాల్ ఈస్ట్‌కు కూడా ఇది మూడో డ్రా అవ్వడం గమనార్హం.

Also Read :

Rajinikanth Health Update : ఆల్ క్లియర్.. ఆస్పత్రి నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ డిశ్చార్జ్..ఆనందంలో అభిమానులు

 మెడిసిన్ ఇచ్చి ఆదుకున‌్న భారతం..మన వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాల ఆరాటం

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు