ISL 2020-21: మరో మ్యాచ్‌ను డ్రాగా ముగించిన హైదరాబాద్‌ ఎఫ్‌సీ, పాయింట్ల పట్టికలో ఎన్నో స్థానంలో ఉందంటే..?

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ ఏడో సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. తాజాగా హైదరాబాద్‌ ఎఫ్‌సీ మరో ఆకట్టుకునే ప్రదర్శనతో అదరగొట్టింది.

  • Ram Naramaneni
  • Publish Date - 9:55 pm, Sat, 12 December 20
ISL 2020-21: మరో మ్యాచ్‌ను డ్రాగా ముగించిన హైదరాబాద్‌ ఎఫ్‌సీ, పాయింట్ల పట్టికలో ఎన్నో స్థానంలో ఉందంటే..?

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ ఏడో సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. తాజాగా హైదరాబాద్‌ ఎఫ్‌సీ మరో ఆకట్టుకునే ప్రదర్శనతో అదరగొట్టింది. లీగ్‌లో బలియమైన జట్టుగా దూసుకుపోతున్న ఏటీకే మోహన్‌ బగాన్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌ను 1-1తో డ్రాగా ఎండ్ చేసింది. 54వ నిమిషంలో మన్వీర్‌ సింగ్‌ చేసిన గోల్‌తో మోహన్‌ బగాన్‌ 1-0తో లీడ్‌లోకి వెళ్లింది. సెకండ్ హాఫ్‌లో హైదరాబాద్‌ ఈ లెక్కను లెవల్ చేసింది. 65వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను జావో విక్టర్‌ గోల్‌గా మలచడంలో హైదరాబాద్‌ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.

స్ట్రాంగ్ టీమ్ అయిన ఏటీకే మోహన్‌ బగాన్‌ను హైదరాబాద్‌ ప్లేయర్స్ మ్యాచ్ ఆసాంతం అడ్డుకున్నారు. ఫస్ట్ హాఫ్‌లో మోహన్‌ బగాన్‌ గోల్ చేసినా .. ఆ తర్వాత హైదరాబాద్‌ అప్రమత్తమైంది. ఇరు జట్లు పందెం కోళ్లలా తలపడటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగింది. లీగ్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లాడిన హైదరాబాద్‌ ఎఫ్‌సీ ఒక మ్యాచ్‌ నెగ్గి, 3 మ్యాచ్‌లను డ్రాగా ముగించింది. 6 పాయింట్లతో పట్టికలో అయిదో స్థానంలో కొనసాగుతోంది. ఇక మ్యాచ్ డ్రాగా ముగియడం పట్ల హైదరాబాద్ ఎఫ్‌సి అసిస్టెంట్ కోచ్ థాంగ్‌బాయ్ సింగ్టో సంతోషం వ్యక్తం చేశారు.

Also Read :

ఆందోళన చేస్తోన్న అన్నదాతల కోసం మొన్న పెద్ద రోటీ యంత్రాలు..ఇప్పుడు ఫుట్ మసాజర్లు, తాత్కాలిక జిమ్‌లు

Bigg Boss 4 Telugu : బిగ్ బాస్ ఫినాలేకు అతిథి మహేశ్ కాదట..’మాస్ కా బాప్’ రాబోతున్నారట !

నెల్లూరు జిల్లా వెలుగొట్లపల్లిలో పొలంలో నాట్లు వేస్తున్న ఆరుగురు కూలీలకు అస్వస్థత..ఒకరు మృతి

మహిళకు పురిటి నొప్పులు, అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేదు : వాలంటీర్లు హీరోలు అయిన వేళ