ఇంతకీ ప్లాస్టిక్ నిషేధం అమలుకు సాధ్యమేనా..?

సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించడానికి ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అక్టోబర్ 2వ తేదీనాటికి ఇళ్లు, కార్యాలయాలు తదితర ప్రదేశాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉపయోగాన్ని నిషేధించాలని ఆయన కోరారు. పర్యావరణానికి, పశువులకు ముప్పుగా పరిణమిస్తున్న ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా చౌకైన వస్తువులను కనిపెట్టాలని మోదీ కోరారు. పశువులకు విరివిగా పచ్చిమేత లభించేలా ప్రయోగాలు చేయాలని సూచించారు. అయితే గతంలో కూడా ప్లాస్టిక్‌ను నియంత్రించాలని జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. మరి అది ఎంతవరకూ […]

ఇంతకీ ప్లాస్టిక్ నిషేధం అమలుకు సాధ్యమేనా..?
Follow us

| Edited By:

Updated on: Sep 14, 2019 | 12:32 PM

సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించడానికి ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అక్టోబర్ 2వ తేదీనాటికి ఇళ్లు, కార్యాలయాలు తదితర ప్రదేశాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉపయోగాన్ని నిషేధించాలని ఆయన కోరారు. పర్యావరణానికి, పశువులకు ముప్పుగా పరిణమిస్తున్న ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా చౌకైన వస్తువులను కనిపెట్టాలని మోదీ కోరారు. పశువులకు విరివిగా పచ్చిమేత లభించేలా ప్రయోగాలు చేయాలని సూచించారు. అయితే గతంలో కూడా ప్లాస్టిక్‌ను నియంత్రించాలని జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. మరి అది ఎంతవరకూ సాధ్యమైంది.

రోజురోజుకి ప్లాస్టిక్ పెను భూతం అవుతోంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్లాస్టిక్ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఓ భాగమైపోయింది. పాలు, కూరగాయలు, టిఫిన్, భోజనం ఏది తేవాలి అన్న ప్లాస్టిక్ కవర్లు కావాల్సిందే.. ప్లాస్టిక్ లేనిదే ఏది తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్లాస్టిక్ పై నిషేదం విధించినా.. ఎన్ని చర్యలు చేపట్టినా లాభం లేకుండా పోతోంది. గ్రామాల నుంచి నగరాల వరకు అంతా ప్లాస్టిక్ మయం అయిపోయింది. చెత్తకుండీలు, నాలాల దగ్గర ఎక్కడపడితే అక్కడ వాడిన కవర్లను పారేస్తున్నారు. ప్లాస్టిక్‌ను తగలబెట్టడం వల్ల దాని నుంచి వెలువడే టాక్సిన్ యమ డేంజర్‌గా మారుతోంది. ఆరోగ్యం పై ప్రభావాన్ని చూపుతోంది. వాటిని పశువులు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి.

గతంలో ప్లాస్టిక్‌ను నిషేధించాలని జీహెచ్ఎంసీ ఓ వినూత్న ప్రయత్నం చేసింది. తడి, పొడి చెత్తలను వేరుగా చేసి పారిశుధ్య సిబ్బందికి అందించేలా.. ఇంటింటికి రెండు చెత్త బుట్టలను పంపిణీ చేసింది. అయినప్పటికీ ఆ సంకల్పం కొద్ది రోజుల వరకే అమలైంది. తడి, పొడి చెత్త ఏదైనా ప్లాస్టిక్ కవర్ల ద్వారానే డంప్ యార్డులకు చేరుతోంది. ప్లాస్టిక్‌పై నిషేధం ఉన్నా అమలుకు నోచుకోని పరిస్థితి దాపురించింది. ఏ సరుకులు కొనుగోలు చేసినా వినియోగదారులు ప్లాస్టిక్ సంచులపైనే ఆధారపడుతున్నారు. వ్యాపారులు సైతం ప్యాక్ చేసేకుందుకు ప్లాస్టిక్‌నే నమ్ముకుంటున్నారు. పాలిథిన్‌ వాడకంతో ఎన్నో అనర్థాలున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్‌ నిషేధించింది. అయినప్పటికీ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా పూర్తిస్థాయిలో నిషేధం అమలుకు నోచుకోవడంలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛభారత్‌ పేరిట పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు నగరాల్లో అక్కడక్కడా తనిఖీలు చేసి హడావుడి చేస్తున్నారే తప్ప అధికారులు సీరియస్ గా తీసుకోవడం లేదు. పాలిథిన్‌ కవర్లతో కలుగుతున్న నష్టాలపై అధ్యయనం చేసిన కేంద్ర ప్రభుత్వం 2016లో ప్లాస్టిక్‌ మేనేజ్‌మెంట్‌ నిబంధనలు రూపొందించింది. వీటిని అమలు పరచాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఫలితం మాత్రం శూన్యంగా కనిపిస్తోంది.

ఇక తాజాగా ప్రధాని మోడీ ప్లాస్టిక్‌ను నిషేధించడానికి సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 12 ప్లాస్టిక్ వస్తువులను నిషేదించాలని నిర్ణయించారు. అందులో జెండాలు, బెలూన్లు, ఇయర్ బడ్స్, క్యాండీలకు ఉపయోగించే పుల్లలు, స్ట్రాలు, 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న సంచులు, ప్లాస్టిక్ షీట్లు అతికించి చేసిన ప్లేట్లు, గిన్నెలు, చిన్ని కప్పులు, ఫోమ్డ్ ప్లేట్లు, కప్పులు, అల్లికలేని బ్యాగులు, చిన్న ప్లాస్టిక్ సీసాలు, ప్యాకింగ్‌కు ఉపయోగించే చిన్న తరహా షీట్లు, థర్మాకోల్ వస్తువులను నిషేధించాలని ప్రకటించారు. అయితే ప్లాస్టిక్ పరిశ్రమ వల్ల లక్షలాది మందికి ఉపాధి లభిస్తోంది. అలాంటి వస్తువులను నిషేధిస్తే వారి ఉపాధి సంగతేంటి అనే ప్రశ్న తలెత్తుతోంది. మరి మోడీ తీసుకున్న నిర్ణయం ఎంతవరకు అమలవుతుందో చూడాలి.

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..