పాక్‌పై మరో ఎయిర్ స్ట్రైక్ దిశగా.. పక్కా ప్లాన్‌తో కేంద్రం..!

పాక్‌పై మరో ఎయిర్ స్ట్రైక్ దిశగా.. పక్కా ప్లాన్‌తో కేంద్రం..!

భారత్ పాకిస్థాన్‌పై మరో ఎయిర్ స్ట్రైక్‌కు సిద్ధమవుతుందా.. తరచూ పాక్ చేస్తున్న కవ్వింపు చర్యలకు చెక్ పెట్టాలని చూస్తుందా.. అంటే కేంద్ర మంత్రులు, ఆర్మీ అధికారులు, అజిత్ దోవల్ చేస్తున్న వ్యాఖ్యలు వింటుంటే అది నిజమనే అర్ధమవుతోంది. గత నెలలోనే ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మళ్ల బాలాకోట్‌లో ఉగ్ర క్యాంపులు వెలిశాయన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు బలం చేకూరేలా తాజాగా నిఘా వర్గాలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత దేశంలో […]

TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Oct 16, 2019 | 9:18 PM

భారత్ పాకిస్థాన్‌పై మరో ఎయిర్ స్ట్రైక్‌కు సిద్ధమవుతుందా.. తరచూ పాక్ చేస్తున్న కవ్వింపు చర్యలకు చెక్ పెట్టాలని చూస్తుందా.. అంటే కేంద్ర మంత్రులు, ఆర్మీ అధికారులు, అజిత్ దోవల్ చేస్తున్న వ్యాఖ్యలు వింటుంటే అది నిజమనే అర్ధమవుతోంది. గత నెలలోనే ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మళ్ల బాలాకోట్‌లో ఉగ్ర క్యాంపులు వెలిశాయన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు బలం చేకూరేలా తాజాగా నిఘా వర్గాలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత దేశంలో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్ కుట్రలు పన్నుతోందని ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీచేస్తున్నాయి. అయితే తాజాగా నిఘా వర్గాలు వెల్లడించిన విషయంతో కేంద్ర మరోసారి తప్పకుండా ఎయిర్ స్ట్రైక్ చేయాలనే భావనతో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం బాలాకోట్‌లో మళ్లీ ఉగ్రస్థావరాలు ఏర్పడ్డాయని.. కశ్మీర్‌లో మరోసారి కల్లోలం సృష్టించేందుకు.. పాక్ ఉగ్రవాదులకు శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. జైషే మహమ్మద్‌ తీవ్రవాద సంస్థ ఆధ్వర్యంలో సూసైడ్‌ బాంబర్లను తయారు చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దాదాపు 40 నుంచి 50 మంది సూసైడ్‌ బాంబర్లను దేశంలో అలజడి సృష్టించేందుకు జైషే మహమ్మద్ సిద్ధం చేస్తున్నట్లు తేల్చాయి. నిఘా వర్గాల హెచ్చిరకలతో కేంద్రం అప్రమత్తమైంది. అయితే ఇటీవల కేంద్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

హర్యానా ఎన్నికల ప్రచారంలో భాగంగా మరోసారి ఎయిర్ స్ట్రైక్ విషయాన్ని లేవనెత్తారు. విజయ దశమి దసరా రోజు మన చేతికి రాఫెల్ యుద్ధ విమానం వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ.. పుల్వామా ఘటన సమయంలో మనం మిగ్ 21 విమానాలతో పాకిస్థాన్ వెళ్లి ఉగ్రశిభిరాలను నేలమట్టం చేయాల్సి వచ్చిందని.. అదే రాఫెల్ ఉంటే మన దేశంలో ఉండే.. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను పేల్చేయవచ్చన్నారు.

మరోవైపు మోదీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. బాలాకోట్ తరహా దాడులు చేయడానికి సిద్ధమంటూ నూతనంగా బాధ్యతలు చేపట్టిన భారత వైమానిక దళాధిపతి.. ఎయిర్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా అన్నారు. భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాల్ని గమనిస్తున్నామని.. దేశాన్ని కాపాడటానికి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని.. ప్రభుత్వం ఆదేశిస్తే ఎలాంటి మిషన్‌ను అయినా పూర్తి చేస్తామంటూ ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. మరో ఎయిర్ స్ట్రైక్ కోసం అంతా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, తాజాగా భారత్ అమ్ముల పొదిలోకి వచ్చిన ఆయుధాలను చూస్తే కూడా.. అవన్నీ మరో ఎయిర్ స్ట్రైక్‌ కోసమే అన్నట్లు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా అత్యంత శక్తివంతమైన స్పైస్-2000 బాంబులు కూడా ఇటీవల ఇజ్రాయిల్ నుంచి భారత్‌కి చేరాయి. ఇవి గతంలో బాలాకోట్‌పై ప్రయోగించిన బాంబులకంటే మరింత శక్తివంతమైనవి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu